Rahul Gandhi: ఆ బాలుడు కోరాడు.. రాహుల్ గాంధీ నెరవేర్చారు.. సోషల్ మీడియా తెగ చెక్కర్లు కొడుతున్న వీడియో…

Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ ఆ మధ్య కాలంలో సామాన్య ప్రజలతో మమేకమై తిరుగుతున్నారు. వారితో పాటు భోజనం చేస్తూ..

Rahul Gandhi: ఆ బాలుడు కోరాడు.. రాహుల్ గాంధీ నెరవేర్చారు.. సోషల్ మీడియా తెగ చెక్కర్లు కొడుతున్న వీడియో...
Rahul Gandhi
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 06, 2021 | 8:39 PM

Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ ఈ మధ్య కాలంలో సామాన్య ప్రజలతో మమేకమై తిరుగుతున్నారు. వారితో పాటు భోజనం చేస్తూ.. వారితోపాటే ప్రయాణిస్తూ హల్‌చల్ చేస్తున్నారు. నాయకుడుంటే ప్రజలకు దూరంగా ఉండే వాడు కాదని, ప్రజల వెంట నడిచేవాడంటూ నిరూపిస్తున్నారు. ఇటీవల కేరళలో ఆటో రిక్షాలో ప్రయాణించిన రాహుల్ గాంధీ.. ఆ తరువాత ఓ వేడుకలో పాల్గొని ప్రజలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఆ సమయంలో తన చెల్లి ప్రియాంక గాంధీని చూడాలని ఓ చిన్నారి కోరగా.. వీడియో కాల్ చేసి మరీ చూపించారు. చిన్నారితో ప్రియాంక గాంధీ కూడా మాట్లాడారు.

ఇదిలాఉంటే, ఇటీవల కేరళలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన రాహుల్ గాంధీ.. కన్నూర్ జిల్లాలోని ఐరవాతి వద్ద తొమ్మిదేళ్ల బాలుడు అద్వైత, అతని తల్లిదండ్రులను కలిశారు. ఆ సందర్భంగా అద్వైతతో రాహుల్ గాంధీ సరదాగా ముచ్చటించారు. ఏం చదువుతున్నావ్, ఏ అవ్వాలనుకుంటున్నావ్.. అంటూ అద్వైతను రాహుల్ గాంధీ ప్రశ్నించగా.. పైలట్ అవ్వాలనుకుంటున్నాను అని బదులిచ్చాడు. అలా అద్వైత తన కోరికను చెప్పడమే ఆలస్యం.. మరుసటి రోజు రాహుల్ గాంధీ అద్వైతను విమానంలో తన వెంట తీసుకెళ్లారు. కాక్‌పిట్‌లో పైలట్లతో ఆ బాలుడిని మాట్లాడించారు. కాక్‌పిట్‌లో ఉండే పరికరాలు, విమానం ఎలా రన్ అవుతుంది, ఎలా ఎగురుతుంది తదితర వివరాలను అద్వైతకు వివరించారు రాహుల్ గాంధీ. దీనికి సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ తన ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేశారు. అలాగే.. ‘అద్వైత కల పెద్దదేం కాదు. అతని నిజం చేయడానికి తొలి అడుగు వేయించాం. ఇప్పుడు అతని కల నెరవేర్చుకోవడానికి, అవకాశాన్ని ఇచ్చే సమాజాన్ని నిర్మించడం మన కర్తవ్యం’ అని రాహుల్ గాంధీ క్యాప్షన్ పెట్టారు. ఇప్పుడు ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గంటల వ్యవధిలోనే 1.6 మిలియన్ల మంది వీడియోను వీక్షించారు. రాహుల్ గాంధీపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Rahul Gandhi Video:

View this post on Instagram

A post shared by Rahul Gandhi (@rahulgandhi)

Also read:

సాగర్‌ ట్రయాంగిల్‌ వార్, కాక పుట్టిస్తోన్న పింక్‌ ఆర్మీ, జానా గెలిచినా వేస్టట.! కుల సమీకరణాల లెక్కలో కమలం అభ్యర్థి.!

Tamil Nadu Assembly Election 2021 voting Live: తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో పోలింగ్ ప్రశాంతం.. విజయంపైనే అభ్యర్థుల ధీమా

Millionaire: ఇండియాలోని ఈ గ్రామ ప్రజలు రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు.. మ్యాటర్ తెలిస్తే అవాక్కవుతారు..