Sidhu Moose Wala Case: పంజాబ్‌లో ఇటీవల ప్రముఖ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా (Sidhu Musewala) దారుణ హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో సిద్ధూ మూసేవాలా కుటుంబాన్ని మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మూసేవాలా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి ఓదార్చారు. సిద్ధూ తండ్రి బాల్‌కౌర్ సింగ్.. రాహుల్‌ను చూడగానే ఆయన్ను హత్తుకొని కన్నీరుమున్నీరయ్యారు. చండీగఢ్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్‌గాంధీ నేరుగా సిద్ధూ స్వగ్రామం మూసాకి వెళ్లి పరామర్శించారు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా, మాజీ డిప్యూటీ సీఎం ఓపీ సోనీ పలువురు నేతలు ఆయన వెంట ఉన్నారు. ఈ నేపథ్యంలో మూసేవాలా నివాసం వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మూసేవాలా హత్య జరిగిన సమయంలో రాహుల్ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఇదిలాఉంటే.. సిద్ధూ తల్లిదండ్రులను గత శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరామర్శించారు. అంతకుముందు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా కలిసి మాట్లాడి న్యాయం చేస్తామని పేర్కొన్నారు.
8 మంది అరెస్ట్..
సిద్ధూ మూసేవాలా హత్య కేసులో 8 మందిని సిట్ అరెస్టు చేసింది. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులను కూడా పోలీసులు గుర్తించారు. వీరంతా షూటర్లకు రాకెటింగ్, లాజిస్టికల్ సపోర్టు అందించారని పోలీసులు తెలిపారు. అదే సమయంలో అరెస్టయిన వారిలో ఒకరు మూసేవాలా గురించిన మొత్తం సమాచారాన్ని ముష్కరులకు అందించాడు. కాగా.. మే29న సిద్ధూ మూసేవాలా (28) దారుణ హత్యకు గురయ్యాడు. మాన్సా జిల్లాలోని స్వగ్రామానికి వెళ్తుండగా దారిలో కొందరు అడ్డగించి.. అతడిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. గ్యాంగ్‌స్టర్ గొడవల కారణంగానే సిద్ధూ మూసేవాలా హత్య జరిగినట్లు పంజాబ్ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
#WATCH | Punjab: Congress leader Rahul Gandhi met the family of late singer and party leader Sidhu Moose Wala at their residence in Moosa village, Mansa today.
(Source: Congress) pic.twitter.com/El9bQmI3pB
— ANI (@ANI) June 7, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..