Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sankranti and Jallikattu: అవనీయపురంలో జల్లికట్టు వేడుకలను వీక్షించిన రాహుల్ గాంధీ..

Sankranti and Jallikattu: సంక్రాంతి పర్వదినం సందర్భంగా తమిళనాడు వ్యాప్తంగా జల్లికట్టు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక మధురైలోని అవనీయపురంలో

Sankranti and Jallikattu: అవనీయపురంలో జల్లికట్టు వేడుకలను వీక్షించిన రాహుల్ గాంధీ..
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 14, 2021 | 3:43 PM

Sankranti and Jallikattu: సంక్రాంతి పర్వదినం సందర్భంగా తమిళనాడు వ్యాప్తంగా జల్లికట్టు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక మధురైలోని అవనీయపురంలో జల్లికట్టు వేడుకలను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వీక్షించారు. జల్లికట్టును వీక్షించిన రాహుల్ అక్కడ ప్రజలనుద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళుల చరిత్ర, తమిళ సంప్రదాయాలు ఎంతో గొప్పవని ప్రశస్తించారు. అప్పట్లో జల్లికట్టుపై పలుమార్లు నిషేధం విధించగా.. జల్లికట్టు పునరుద్ధరణ కోసం తమిళులు ఎంతగానో పోరాటం చేశారని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ జల్లికట్టుని ఎంతో కట్టుదిట్టమైన భద్రతల మధ్య నిర్వహిస్తున్నారని ఆయన కితాబిచ్చారు. తమిళ భాష, తమిళ సంప్రదాయాలను యావత్ భారతదేశం గౌరవిస్తుందని రాహుల్ పేర్కొన్నారు. తనను తమిళనాడు ప్రజలు ఎంతగానో అదరిస్తున్నారని అన్నారు. తమిళ సంప్రదాయమైన జల్లికట్టు లాంటి ఆటలను చూడటానికి రావడం తన బాధ్యత అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

అయితే, దీనికి ముందు డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు ఉదయ నిధి స్టాలిన్‌.. రాహుల్ గాంధీని అవనీయపురం తీసుకెళ్లారు. అక్కడ రాహుల్‌ పక్కనే కూర్చున్నారు. జల్లికట్టు పోటీలు సందర్భంగా ఆయనతో కాసేపు ముచ్చటించారు. ఇక అవనీయపురం జల్లికట్టు పోటీలలో దాదాపు 700 ఎద్దులు, 300 మంది వీరులు పాల్గొన్నారు. పోటీల సందర్భంగా ఎవరికైనా గాయాలైతే వెంటనే వైద్యసాయం అందించేందుకు వీలుగా 10 ప్రత్యేక వైద్య బృందాలను, అధికారులను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది.

ఇదిలాఉండగా, తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో జల్లికట్టు పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పోటీల్లో 200 ఎద్దులు పాల్గొన్నాయి. ఈ ఎద్దులను నిలువరించేందుకు వీరులు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. జల్లికట్టు పోటీలసు వీక్షించడానికి జనాలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కరోనా నిబంధనలను పూర్తిగా బేఖాతరు చేస్తూ కనీసం మాస్క్‌లు లేకుండా తరలివచ్చారు. కాగా, జల్లికట్టు పోటీల్లో భాగంగా ఎద్దులను నిలువరించే క్రమంలో 20 మంది గాయపడ్డారు. వీరందరినీ వెల్లూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ఈనెల 16వ తేదీన ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అలాంగనల్లూర్‌లో జరగనున్న జల్లికట్టు వేడుకలను తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రారంభించనున్నారు.

Also read:

జల్లికట్టు పోటీలను వీక్షించడానికి మధురైకి రాహుల్‌ గాంధీ.. అలాంగనల్లూర్‌లో పోటీలను ప్రారంభించనున్న సీఎం..

Bowenpally Kidnap Case: అఖిలప్రియను న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చిన పోలీసులు.. 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌