AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Gandhi: రాహుల్ ఆరోపణలు అర్ధరహితం.. సోషల్ మీడియాలో నెటిజన్ల రియాక్షన్స్ ఇవే..

Rahul Gandhi Twitter: ప్రభుత్వ ఒత్తిడి మేరకు ట్విట్టర్ పనిచేస్తోందని కాంగ్రెస్ (Congress) మాజీ అధ్యక్షుడు, వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Rahul Gandhi: రాహుల్ ఆరోపణలు అర్ధరహితం.. సోషల్ మీడియాలో నెటిజన్ల రియాక్షన్స్ ఇవే..
Rahul Gandhi
Shaik Madar Saheb
| Edited By: Anil kumar poka|

Updated on: Jan 28, 2022 | 6:53 PM

Share

Rahul Gandhi Twitter: ప్రభుత్వ ఒత్తిడి మేరకు ట్విట్టర్ పనిచేస్తోందని కాంగ్రెస్ (Congress) మాజీ అధ్యక్షుడు, వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తన ఫాలోవర్ల సంఖ్య తగ్గిందని.. రాహుల్ తన ట్విట్టర్లో పేర్కొన్న విషయం తెలిసిందే. రాహుల్ ఆరోపణలపై ట్విట్టర్ సైతం స్పందించింది. సురక్షితమైన ప్లాట్‌ఫాం విశ్వసనీయ ఖాతాలను నిర్ధారించడానికి నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పింది. దీనివల్ల ఫాలోవర్ల సంఖ్యలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయని పేర్కొంది. అయితే.. ఈ సమయంలో రాహుల్ ట్విట్టర్‌లో చేసిన ఆరోపణలపై బీజేపీ (BJP) నేతలు.. నెటిజన్లు నుంచి పలు రకాలైన స్పందనలు వస్తున్నాయి.

రాహుల్ ఆరోపణలపై టీవీ జర్నలిస్ట్ రాహుల్ శివశంకర్ ట్వీట్ చేస్తూ.. ‘డియర్ పరాగ్.. ట్విట్టర్ ఫాలోవర్లు తక్కువగా ఉన్న నేపథ్యంలో రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా పావుగా మారాలని అనుకుంటున్నారంటూ ఎద్దెవా చేశారు. ఆన్‌లైన్‌లో ఈ సంకేతాలు కాంగ్రెస్‌ అధినేతకు అశుభం. ట్విట్టర్ కూడా తనపై వచ్చిన ఆరోపణలను ఖండించింది. ఎన్నికల సంఘం చేసినట్లే చేసిందన్నారు.

అదే సమయంలో, బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ట్వీట్ చేస్తూ.. ‘రాహుల్ గాంధీ 2021లో తన ఖాతాను తాత్కాలికంగా సస్పెండ్ చేసినప్పటి నుండి తన ఫాలోవర్ల సంఖ్య పెరగలేదని ట్విట్టర్‌లో ఫిర్యాదు చేశారు. రాహుల్ వాస్తవ ప్రపంచంలో.. ఇప్పుడు వర్చువల్ ప్రపంచంలో కూడా ప్రేక్షకులను పొందడం లేదు! ఇప్పుడు తదుపరి ఏమిటి? ఓట్లు పడకపోవడంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు రాస్తారా అంటూ చురకలంటించారు.

రిషి బగ్రీ అనే ట్విటర్ యూజర్ మాట్లాడుతూ, ‘అమేథీలో ఓడిపోయిన తర్వాత, ఈవీఎంలను తప్పుపట్టారు. అనుచరులను తగ్గించే బాధ్యత ట్విట్టర్‌దే. నాయకులు పార్టీని వీడితే దానికి బీజేపీ బాధ్యత వహిస్తుందా..? రాష్ట్ర ఎన్నికలలో పార్టీ ఓడిపోతే, అతను మళ్ళీ ఓటర్లను నిందిస్తారంటూ ఎద్దెవా చేశారు.

అంతేకాకుండా.. పలు ఫ్లాట్ ఫాంలల్లో రాహుల్ వ్యాఖ్యలను జోడిస్తూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

Also Read :

India Coronavirus: గుడ్‌న్యూస్.. దేశంలో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు.. కానీ..

Viral Video: అయ్యో… ఈ తల్లి ఎలుగుకి ఎన్ని కష్టాలో.. ఓవైపు నవ్వొస్తుంది.. మరోవైపు జాలేస్తుంది