Rahul Gandhi: పార్లమెంట్ ను కుదిపేసిన అగ్నివీర్.. అదానీ – మోదీల సంబంధం ఏంటో చెప్పాలని రాహుల్ డిమాండ్..

|

Feb 07, 2023 | 3:34 PM

బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్ని వీర్ పై కాంగ్రెస్ ముఖ్యనేత, ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో పాదయాత్రలో ఎంతోమంది నిరుద్యోగులు తనను కలిశారన్న రాహుల్.. - అగ్నివీర్‌పై యువకుల్లో..

Rahul Gandhi: పార్లమెంట్ ను కుదిపేసిన అగ్నివీర్.. అదానీ - మోదీల సంబంధం ఏంటో చెప్పాలని రాహుల్ డిమాండ్..
Rahul Gandi
Follow us on

బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్ని వీర్ పై కాంగ్రెస్ ముఖ్యనేత, ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో పాదయాత్రలో ఎంతోమంది నిరుద్యోగులు తనను కలిశారన్న రాహుల్.. – అగ్నివీర్‌పై యువకుల్లో అసంతృప్తి కనిపించిందని మండిపడ్డారు. ఉన్నత చదువులు చదివి కాబ్స్‌ నడుపుకునే పరిస్థితులు బీజేపీ పాలనలో వచ్చాయని విమర్శించారు. నిరుద్యోగం, అధిక ధరలు, రైతు సమస్యలే అధికంగా ఉన్నాయని బీజేపీపై ఫైర్ అయ్యారు. దేశం మొత్తం అదానీ గురించి మాట్లాడుకుంటోందన్న రాహుల్.. దేశ సంపదను కొందరికి మాత్రమే కట్టబెడుతున్నారని ఆక్షేపించారు. మోదీ-అదానీ మధ్య ఉన్న సంబంధమేంటో చెప్పాలని పార్లమెంట్ వేదికగా రాహుల్‌ గాంధీ డిమాండ్ చేశారు. భారత్ ఇజ్రాయెల్ రక్షణ ఒప్పందాల కాంట్రాక్టులన్నీ అదానికే ఇచ్చారని, అదాని ఆస్తులు ఎనిమిది బిలియన్ డాలర్ల నుంచి 140 బిలియన్ డాలర్లకు ఎలా పెరిగిందని నిలదీశారు.

అదానితో ప్రధాని మోదీ కలిసి ఉన్న ఫొటోలను పార్లమెంట్ లో రాహుల్ గాంధీ ప్రదర్శించారు. ఆ ఫొటోలు ప్రదర్శించవద్దని స్పీకర్ సూచించారు. అదాని సక్సెస్ వెనుక ఎవరున్నారని ప్రజలు అడుగుతున్నారన్న రాహుల్ గాంధీ దేశం మొత్తం ఆదాని గురించి చర్చిస్తోందన్నారు. అయితే.. ఆరోపణలు కాదు..ఆధారాలు ఇవ్వాలన్న కేంద్రమంత్రి రిజిజు నిలదీశారు. ముంబయి విమానాశ్రయాన్ని జీవీకే నుంచి లాక్కుని అదానికి కట్టబెట్టారని, అదానికి సంస్థకు విమానాశ్రయాల నిర్వహణలో అనుభవమే లేకపోయినా ముంబయి ఎయిర్ పోర్ట్ ఎందుకు అప్పగించారని మండిపడ్డారు.

కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 3,500 కిలోమీటర్లు ప్రజలతో కలిసి నడిచాను. ఉదయం 4 గంటలకు లేచి సైన్యంలో చేరడానికి శారీరక వ్యాయామం చేసే దేశంలోని యువకులు ఎప్పుడూ సంతోషంగా ఉండరు. ఇంతకుముందు 15 ఏళ్ల సర్వీసు తర్వాత వారికి పింఛను ఇచ్చేవారు, అగ్నివీర్‌లో కేవలం నాలుగేళ్ల సర్వీసు తర్వాత వారిని బయటకు పంపిస్తామన్నారు. ఇది ఆర్ఎస్ఎస్ లేదా హోం మంత్రిత్వ శాఖ నుండి వచ్చి ఉండవచ్చు.

ఇవి కూడా చదవండి

     – రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ముఖ్యనేత

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..