PFI-NIA: ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న పీఎఫ్ఏ రహస్యాలు.. ఎన్ఐఏ విచారణలో సంచలనాలు..

Sanjay Kasula

Sanjay Kasula |

Updated on: Feb 07, 2023 | 4:02 PM

యాకూబ్‌ విచాణలో సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. పీఎఫ్ఏ టార్గెట్‌ భయంకరంగా ఉన్నట్లుగా ఎన్ఐఏ తెలిపింది. గత ఏడాదిన్నర కాలంలో బీహార్‌లో సుమారు డజన్‌కు పైగా శిక్షణా శిబిరాలను నిర్వహించినట్లుగా తెలుస్తోంది.

PFI-NIA: ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న పీఎఫ్ఏ రహస్యాలు.. ఎన్ఐఏ విచారణలో సంచలనాలు..
PFI Training Meeting

రోజు రోజుకు కొత్త ప్రణాళికతో దేశంలోని భద్రతా సంస్థలను ఆందోళనకు గురి చేసింది పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ). పీఎఫ్ఐ ఇప్పుడు సాయుధ శిక్షణకు బదులుగా ముఖ్యమైన వ్యక్తులను లక్ష్యంగా ప్లాన్ చేస్తోంది. బీహార్ మాడ్యూల్‌పై విచారణ జరుపుతున్న ఎన్ఐఏ  ప్రభుత్వ చర్య తర్వాత పీఎఫ్ఐ ఇప్పుడు దేశంలో విద్వేశాలను సృష్టించేందుకు, మత సామరస్యానికి భంగం కలిగించే లక్ష్యంతో హత్యకు పాల్పడుతున్నట్లు సంచలన సమాచారం వెలుగులోకి వచ్చింది.

ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వర్గాల సమాచారం ప్రకారం, పరారీలో ఉన్న బీహార్ పీఎఫ్‌ఐ మాడ్యూల్‌లో నిందితుడు యాకూబ్ ఈ కుట్రకు ప్రధాన సూత్రధారి అని తేలింది. బీహార్‌లోని చకియా ప్రాంతానికి చెందిన యాకూబ్ గత ఏడాదిన్నరగా సాయుధ శిక్షణ ఇస్తున్నట్లు నిఘా సంస్థ విచారణలో తేలింది. అయితే పీఎఫ్‌ఐపై నిషేధం విధించిన వెంటనే తన పంథాను మార్చుకున్నట్లుగా తెలుస్తోంది.

PFI లక్ష్యాల జాబితాను సిద్ధం..

పీఎఫ్ఏ ఈ బీహార్ మాడ్యూల్ యాకూబ్‌కు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పంపిణీ చేసే ముఖ్యమైన లక్ష్యాల జాబితాను రూపొందించింది. అసలే నిషేధం తర్వాత మళ్లీ తన ఉనికిని నమోదు చేసుకునేందుకు పీఎఫ్ఐ ప్రయత్నిస్తోందని అందుకే ఇలాంటి ఘటనలకు పాల్పడేందుకు సిద్ధమవుతోందని పోలీసులు తెలిపారు.

గత ఏడాదిన్నర కాలంలో యాకూబ్ బీహార్‌లో దాదాపు 1 డజను శిక్షణా శిబిరాలను నడిపినట్లు దర్యాప్తు సంస్థల విచారణలో కూడా వెలుగులోకి వచ్చింది. ఈ శిబిరాలు ఫుల్వారీ షరీఫ్, బెట్టియా, దర్భంగా, మోతిహారి, కతిహార్, పూర్నియా, అరారియా, మధుబని, బీహార్ షరీఫ్‌లలో నిర్వహించినట్లుగా విచారణలో తేలింది.

ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ శిబిరాల నిర్వాహకులపై చర్యలు తీసుకున్న తర్వాత యాకూబ్, అతని సహచరులు ఆయుధాలను సేకరించడం ప్రారంభించారు. గత 3 రోజులలో పీఎఫ్ఏ బీహార్ ఫుల్వారీ షరీఫ్ మాడ్యూల్‌తో సంబంధం ఉన్న ముగ్గురిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. అయితే ఇప్పటికే యాకూబ్ ఇచ్చిన టార్గెట్‌లో చాలా మంది పని చేస్తున్నారని ఎన్ఐఏ తెలిపింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu