AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India – Pakistan ఆర్థిక కష్టాల్లో ఉన్నా అదే వంకర బుద్ది.. భారత్ విషయంలో మరోసారి పాకిస్థాన్ కుట్రలు.

భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య గగనతలంలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇండియా నుంచి టర్కీ వెళ్లే విమానాలను తమ గగనతలం మీదుగా పంపించేందుకు పాక్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అపదలో అసరాగా..

India - Pakistan ఆర్థిక కష్టాల్లో ఉన్నా అదే వంకర బుద్ది.. భారత్ విషయంలో మరోసారి పాకిస్థాన్ కుట్రలు.
India Flights In Pak
Ganesh Mudavath
|

Updated on: Feb 07, 2023 | 2:55 PM

Share

భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య గగనతలంలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇండియా నుంచి టర్కీ వెళ్లే విమానాలను తమ గగనతలం మీదుగా పంపించేందుకు పాక్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అపదలో అసరాగా నిలుస్తున్న భారత్ ను అడ్డుకునేందుకు, మానవతా సహాయం పంపకుండా భారత్‌ను నిరోధించేందుకు పాకిస్తాన్ ప్రయత్నించడం ఇది రెండోసారి. టర్కీ, సిరియాలు 7.9-తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి కకావికలమయ్యాయి. భూకంపం ధాటికి 4,800 మంది మరణించారు. పదివేల మందికి పైగా గాయపడ్డారు. వేలాది మంది భవనాల శిథిలాల కింద చిక్కుకున్నారు. ఇండియన్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందాలు ఆధునిక డ్రిల్లింగ్ పరికరాలు, మెడికల్స్, రెస్క్యూ డాగ్‌లతో ఇప్పటికే అదానా విమానాశ్రయంలో దిగాయి. అయితే పాకిస్తాన్ తన గగనతలాన్ని ఉపయోగించడానికి విమానానికి అనుమతి నిరాకరించినందున ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవాల్సి వచ్చింది.

2021లో అఫ్గానిస్థాన్ ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత పాకిస్తాన్ తన భూభాగాన్ని ఉపయోగించకుండా భారత్‌ను అడ్డుకుంది. భారతదేశం నుంచి అఫ్గానిస్థాన్ కు వస్తువులను వాఘా సరిహద్దు పాయింట్ నుంచి పాకిస్తాన్ ట్రక్కులలో రవాణా చేయాలంది. ఉత్తరప్రదేశ్‌లోని హిండన్ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన విమానం వేరే దారిలో వెళ్లవలసి వచ్చింది. టర్కీకి చెందిన డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అథారిటీ (AFAD) శిథిలాల కింద చిక్కుకున్న ప్రజలను రక్షించడంలో ఇబ్బందులను ఎదుర్కొంటోంది.

టర్కీ, సిరియాల్లో పెను విషాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. ఆ రెండు దేశాలకు అండగా ఉంటామని..అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించారు. ఇవాళ స్పెషల్‌ ఫ్లైట్స్‌లో ఫుడ్, మెడిసిన్స్‌, ఇతర పరికరాలను తరలిస్తున్నారు.మరోవైపు టర్కీ, సిరియాలకు సాయమందించడానికి 45 దేశాలు ముందుకొచ్చాయి. సహాయక చర్యల కోసం గాలింపు బృందాలు, వైద్య సామాగ్రిని పంపనున్నట్టు ప్రకటించాయి. అమెరికా, రష్యా, జర్మనీ, తైవాన్ సహా అనేక దేశాలు అండగా నిలుస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..