Punjab’s Second Lynching: పంజాబ్‌లో సిక్కుల పవిత్ర ఆలయాలను ఆగంతకులు టార్గెట్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. స్వర్ణదేవాలయాన్ని అపవిత్రం చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని కొట్టి చంపిన ఘటన మరవక ముందే కపూర్తాలాలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. గురుద్వారాలో ప్రవేశించిన వ్యక్తిని స్థానిక యువకులు కొట్టి చంపారు. గురుద్వారాలో ప్రవేశించిన వ్యక్తిని ముందు ఓ గదిలో నిర్భంధించారు ఆలయ నిర్వాహకులు. ఆ తర్వాత పోలీసులు అక్కడికి చేరుకొని ఆ యువకుడిని విడిపించేందుకు ప్రయత్నించారు. అయితే సిక్కు యువకులకు పోలీసులకు మధ్య తీవ్ర గొడవ జరిగింది. గదిలో బంధించిన యువకుడిపై దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. వరుసగా జరుగుతున్న ఘటనలపై పంజాబ్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఇలాంటి పనులు చేసేవారిని కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి చన్ని ఆదేశించారు. దీనిలో భాగంగా సీఎం చరణ్‌జీత్‌సింగ్ చన్నీ ఈ రోజు స్వర్ణదేవాలయాన్ని సందర్శిస్తున్నారు.
సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రం అమృత్‌సర్ స్వర్ణదేవాలయంలో శనివారం రాత్రి భీభత్సం సృష్టించిన ఓ వ్యక్తిని కొట్టి చంపిన విషయం తెలిసిందే. గర్భగుడిలోకి ప్రవేశించి బీభత్సం సృష్టించిన ఆ యువకుడిపై భక్తులు ఒక్కసారిగా దాడి చేశారు. తాజాగా.. కపుర్తలా జిల్లాలోని నిజాంపూర్ గ్రామంలో ఓ వ్యక్తి గురుద్వారాలో చొరబడి.. సిక్కుల పవిత్ర పతాకం నిషాన్ సాహిబ్‌ను అతను అపవిత్రం చేస్తూ స్థానికుల కంటబడ్డాడు. దీంతో అతన్ని చుట్టుముట్టిన స్థానికులు.. దాడి చేశారు. కాగా.. అమృత్‌సర్ లో జరిగిన ఘటన మరువకముందే.. మరో ఘటన చోటుచేసుకోవడంతో.. పంజాబ్‌లో ఆందోళన వ్యక్తమవుతోంది.
కాగా.. ఈ ఘటనపై పంజాబ్ డీజీపీ ఛటోపాధ్యాయ స్పందించారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు. అమృత్‌సర్, కపుర్తలలో జరిగిన దురదృష్టకర సంఘటనలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో మత సామరస్యానికి భంగం కలిగించే ఏ ప్రయత్నమైనా కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. పంజాబ్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టంచేశారు.
I have taken serious note of the unfortunate incidents in Amritsar and Kapurthala. Any attempt to violate the communal harmony in the state will be dealt with a firm hand.
Stern action will be taken against all those disturbing the law and order in Punjab. #PunjabStandsTogether
— DGP Punjab Police (@DGPPunjabPolice) December 19, 2021
Also Read: