
దేశంలో ఓవైపు 76 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు భారతీయులు సిద్ధవుతున్నారు. ఈ నేపథ్యంలో భారత ఖ్యాతిని మరింత పెంచేలా పంజాబ్‌కు చెందిన ఓ సీనియర్ పోలీస్ అధికారి ప్రపంచానికి భారతీయుడి సత్తా చాటిచెప్పాడు. అత్యంత ఎత్తైనటువంటి ఎల్ర్బస్ అనే పర్వతంపై భారతీయ జెండాను ఎగురవేసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకునేలా చేశాడు. దీంతో ప్రజలు, అధికారుల, ఉన్నతాధికారులు, అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే పంజాబ్‌కు చెందిన గుర్జోత్ సింగ్ కలేర్ అనే పోలీస్ అధికారి.. రష్యా, యూరప్‌లో అత్యంత ఎత్తైన ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించాడు. అతను ఈ పర్వతాన్ని ఎక్కే సమయంలో భారీ మంచు తుఫానులు, ఉరుములు, క్లిష్టమైన వాతావరణ పరిస్థుతులు ఏర్పడ్డాయి. అయినా కూడా వాటిని తట్టుకోని, పోరాడి ఆగస్ట 11న ఉదయం 7 గంటలకు ఎల్బ్రస్ పర్వతంపైకి కలేర్ బృందం చేరుకుంది. ఆ తర్వాత నలుగురు కలేర్ సభ్యులు బృందం ఆ పర్వతంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
తమ పర్వతాధిరోహణపై గుర్జోజ్ సింగ్ కలేర్ స్పందించారు. ఈ పర్వతాన్ని ఎక్కేందుకు సుమారు ఐదు రోజుల వరకు సమయం పట్టినట్లు చెప్పారు. అలాగే పర్వతం శిఖరాగ్రంలో వాతావరణం చాలా క్లిష్టంగా ఉందని.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోందని అన్నారు. దీనివల్ల ఈ అధిరోహన చాలా కష్టతరమైందని చెప్పారు. ఒకనొక సమయంలో కూడా అసలు ఈ పర్వతం అధిరోహించడం అసాధ్యమని అనిపించినట్లు తెలిపారు. అయినా కూడా తమ పట్టుదలను వదలిపెట్టలేదని.. సంకల్పంతో మందుకు వెళ్లి విజయం సాధించామని పేర్కొన్నారు. మరో విషయం ఏంటంటే వృత్తిపరంగా శిక్షణ పొందిన మౌంటనీర్ కలేర్ ఉత్తరాఖాండ్‌లోని నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్‌లో బేసిక్ మౌంటెనీరింగ్ కోర్సులో ఉత్తమ పర్వతారోహకుడిగా కూడా ఎంపిక అయ్యారు.
ఇదిలా ఉండగా గుర్జోత్ సింగ్ కలేర్ అంతకుముందు కూడా ఆఫ్రికా ఖండంలోనే ఎత్తైన శిఖరం కిలిమంజారో పర్వాతాన్ని కూడా అధిరోహించారు. అలాగే కొవిడ్ సమయంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన కరోనా యోధుల ధైర్యానికి హృదయపూర్వక నివాళిగా 15 వేల అడుగుల ఎత్తు నుంచి స్కైడైవ్ కూడా చేశారు. అయితే కలేర్ ప్రస్తుతం ఏఐజీగా విధులు నిర్వహిస్తున్నారు. 2023 జనవరిలో విధి పట్ల అత్యుత్తమ అంకితభావానికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా కూడా మెడల్‌ను స్వీకరించారు. మరో విషయం ఏంటంటే రష్యాలోని ఎల్బ్రస్ పర్వతం సముద్రమట్టానికి 5,642 మీటర్ల అడుగుల ఎత్తులో ఉంటుంది. అలాగే ఈ పర్వతం చుట్టూ అంతా మంచుతో కప్పబడి ఉంటుంది. అనేకమంది పర్వాతారోహకులు ఈ పర్వతాన్ని ఎక్కేందుకు ప్రయాత్నాలు చేస్తుంటారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.