Punjab Lok Congress: కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్త పార్టీ పేరు ఖరారు.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా..

Punjab Lok Congress: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్త పార్టీ పేరు ఖరారయ్యింది. తన పార్టీ పేరు పంజాబ్ లోక్ కాంగ్రెస్‌గా ఆయన మంగళవారం అధికారికంగా ప్రకటించారు.

Punjab Lok Congress: కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్త పార్టీ పేరు ఖరారు.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా..
Amarinder Singh

Edited By: Anil kumar poka

Updated on: Dec 23, 2021 | 6:48 PM

Punjab Lok Congress: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్త పార్టీ పేరు ఖరారయ్యింది. తన పార్టీ పేరు పంజాబ్ లోక్ కాంగ్రెస్‌గా ఆయన మంగళవారం అధికారికంగా ప్రకటించారు. కాగా అమరీందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి పంపారు. తన రాజీనామా లేఖలో పంజాబ్ పీసీసీ చీఫ్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూపై విరుచుకపడ్డారు. పంజాబ్‌కు చెందిన పార్టీ ఎంపీలందరూ మూకుమ్మడిగా వ్యతిరేకించినా సిద్ధూను పీసీసీ అధ్యక్షుడిగా మీరు నియమించారంటూ అభ్యంతరం వ్యక్తంచేశారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ భజ్వాను సిద్ధూ బహిరంగంగా ఆలింగనం చేసుకున్నారని మండిపడ్డారు.

మీ చర్యలు తనను గాయపరిచినట్లు సోనియాగాంధీకి రాసిన ఆ లేఖలో అమరీందర్ సింగ్ అసంతృప్తి వ్యక్తంచేశారు. రాజీవ్ గాంధీతో తనకు పాఠశాల రోజుల నుంచే 67 ఏళ్ల అనుబంధం(1954 నుంచి) ఉందని గుర్తు చేసుకున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంగ గాంధీలను తన బిడ్డలతో సమానంగా ప్రేమిస్తున్నట్లు పేర్కొన్నారు. పంజాబ్ రాష్ట్రం, దేశ ప్రయోజనాల కోసం తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో కెప్టెన్ అమరీందర్ సింగ్ స్పష్టంచేశారు.

 

వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోబోతున్నట్లు అమరీందర్ సింగ్ ఇది వరకే ప్రకటించారు. అలాగే శిరోమణి అకాలీదళ్ చీలికవర్గంతో పొత్తు ఉండే అవకాశముందన్నారు. పొత్తు లేకపోయినా అన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించారు. సిద్ధూ రాష్ట్రంలో ఎక్కడి నుంచి పోటీ చేస్తే.. అక్కడి నుంచి తాము కూడా పోటీ చేస్తామని చెప్పారు.

Also Read..

Kabul Twin Blasts: కాబూల్‌లో రెండు చోట్ల బాంబు పేలుళ్లు.. 19 మంది మృతి..

Sugar Prices: దేశంలో చక్కెర ధర ఎందుకు పెరుగుతుందో తెలుసా..? ఈ కారణాల వల్లే..