ఖలిస్తానీ ఉగ్రవాదుల చేతిలో కాంగ్రెస్‌ నేత దారుణ హత్య.. తామే చేశామంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్!

|

Sep 19, 2023 | 8:45 AM

పంజాబ్‌లోని మోగా జిల్లా దాలా గ్రామంలో స్థానిక కాంగ్రెస్ నేత తన నివాసంలో సోమవారం (సెప్టెంబర్‌ 18) దారుణ హత్యకు గురయ్యాదు. గుర్తు తెలియని దుండగులు తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కాంగ్రెస్‌ నేత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడిని బల్జిందర్‌ సింగ్‌ బల్లిగా పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఖలిస్తానీ ఉగ్రవాదులు..

ఖలిస్తానీ ఉగ్రవాదుల చేతిలో కాంగ్రెస్‌ నేత దారుణ హత్య.. తామే చేశామంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్!
Baljinder Singh Balli
Follow us on

పంజాబ్‌, సెప్టెంబర్ 19: పంజాబ్‌లోని మోగా జిల్లా దాలా గ్రామంలో స్థానిక కాంగ్రెస్ నేత తన నివాసంలో సోమవారం (సెప్టెంబర్‌ 18) దారుణ హత్యకు గురయ్యాదు. గుర్తు తెలియని దుండగులు తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కాంగ్రెస్‌ నేత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడిని బల్జిందర్‌ సింగ్‌ బల్లిగా పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఖలిస్తానీ ఉగ్రవాదులు దారుణానికి తెగబడినట్లు తెలుస్తోంది.

స్థానిక కాంగ్రెస్ నేత బల్జీందర్ సింగ్ బల్లిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. బల్జీందర్ సింగ్ అజిత్వాల్‌లోని కాంగ్రెస్ బ్లాక్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. దాలా గ్రామంలోని ఆయన నివాసంలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే కెనడాకు చెందిన ఖలిస్తాన్ ఉగ్రవాది అర్ష్ డల్లా.. తామే ఈ హత్య చేసినట్లు ఫేస్‌బుక్ పేజ్‌లో పోస్టు పెట్టాడు. ఈ పోస్టులో.. బల్జిందర్ సింగ్ తన భవిష్యత్తును నాశనం చేశాడని, తనను గ్యాంగ్‌స్టర్ సంస్కృతిలోకి నెట్టాడని డల్లా తన పోస్ట్‌లో ఆరోపించారు. తన తల్లి అరెస్ట్‌ వెనుక కాంగ్రెస్ నాయకుడి హస్తం ఉందని, ఇది తనను ప్రతీకారం తీర్చుకునేలా ప్రేరేపించిందని పేర్కొన్నారు.

కాగా ఉగ్రవాది అర్ష్ దల్లా.. లిస్టెడ్ టెర్రరిస్ట్ అండ్‌ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ (NIA) ఉగ్ర సంస్థలో గత మూడు, నాలుగేళ్లుగా చురుగ్గా పాల్గొంటున్నాడు. కెనడా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న అర్ష్‌ దల్లా పంజాబ్‌లో జరిగిన పలు ఉగ్రవాద హత్యలకు పాల్పడ్డాడు. అర్ష్ డల్లా భారత్ టెర్రరిస్టుగా గుర్తించింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అతని కోసం గాలిస్తోంది. బల్జీందర్ సింగ్ బల్లి తన ఇంట్లో హెయిర్‌కట్ చేయించుకుంటున్న సమయంలో కొన్ని పత్రాలపై సంతకం చేయించుకోవాలనే నెపంతో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. దీంతో బల్జీందర్‌ సింగ్‌ ఇంటి నుంచి వెలుపలికి వచ్చిన వెంటనే తమతో తెచ్చుకున్న తుపాకులతో బల్జీందర్‌ సింగ్‌ బల్లిపై కాల్పులు జరిపి బైక్‌పై పరారయ్యారు. దాడి అనంతరం ఘటనా స్థలం నుంచి దుండగులు పారిపోవడాన్ని CCTV వీడియోలో కనిపించాయి. ఈ ఘనలో తీవ్రంగా గాయపడిన బల్జీందర్‌ సింగ్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానిక అధికారులు కేసు, నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.