Punjab Health Minister: పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం.. భగవంత్ మాన్ కేబినెట్ నుంచి హెల్త్ మినిస్టర్ ఔట్

Punjab Health Minister Sacked: అవినీతి ఆరోపణల కారణంగా ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ సింగ్లాను మంత్రివర్గం నుంచి సీఎం భగవంత్ మాన్ తొలగించారు. పంజాబ్ ఆరోగ్య మంత్రి విజయ్ సింగ్లా కాంట్రాక్టులు ఇచ్చేటపుడు పర్సంటేజ్ కమీషన్ డిమాండ్ చేశారు.

Punjab Health Minister: పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం.. భగవంత్ మాన్ కేబినెట్ నుంచి హెల్త్ మినిస్టర్ ఔట్
Punjab Health Minister Sack
Follow us
Sanjay Kasula

|

Updated on: May 24, 2022 | 2:49 PM

పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం తీసుకున్నారు. అవినీతి ఆరోపణల కారణంగా ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ సింగ్లాను మంత్రివర్గం నుంచి సీఎం భగవంత్ మాన్ తొలగించారు. పంజాబ్ ఆరోగ్య మంత్రి విజయ్ సింగ్లా కాంట్రాక్టులు ఇచ్చేటపుడు పర్సంటేజ్ కమీషన్ డిమాండ్ చేశారు. సీఎం భగవంత్ మాన్ ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఒక్క పైసా అవినీతిని తమ ప్రభుత్వం సహించదన్నారు. అవినీతికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం నుంచి మా పార్టీ (ఆప్) ఉద్భవించిందని గుర్తు చేశారు. నా కేబినెట్‌లోని ఓ మంత్రి అధికారుల నుంచి టెండర్లలో 1 శాతం కమీషన్ తీసుకుంటున్నారని నాకు తెలిసింది. నేను ఆయనను మంత్రివర్గం నుంచి తొలగిస్తున్నాను. ఈ విషయంలో పోలీసు విచారణకు కూడా ఆదేశించాను. ఇది జరిగిన కొద్దిసేపటికే అవినీతి నిరోధక శాఖ అధికారులు సింగ్లాను అరెస్టు చేశారు.

తమ ప్రభుత్వం అవినీతి రహితంగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం భగవంత్ మాన్ స్పష్టం చేశారు. మరోవైపు, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఈ నిర్ణయాన్ని కొనియాడారు. తమ పార్టీ తన సొంత నాయకులపై చర్య తీసుకునే నిజాయితీ మరియు ధైర్యం ఉన్న ఏకైక పార్టీ అని పేర్కొన్నారు. సింగ్లా మాన్సా అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అని తెలియజేద్దాం. మార్చి 19న, పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేసిన మూడు రోజుల తర్వాత, సింగ్లాతో పాటు మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

అదే సమయంలో.. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను విజయ్ సింగ్లా అంగీకరించినట్లు సీఎం మాన్ తెలిపారు. ఆప్ ప్రభుత్వం మొదటిసారిగా ఈ చర్య తీసుకోలేదని.. అంతకు ముందు కూడా ఆప్ తన మంత్రిని క్యాబినెట్ నుంచి తొలగించింది. ఆప్ ఇలాంటి చర్య తీసుకోవడం ఇది రెండోసారి. అంతకు ముందు 2015లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన ఆహార సరఫరా మంత్రిని తొలగించారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన సూచించారు.