Lottery Ticket: అదృష్టం అంటే ఇదీ.. లాటరీ టికెట్‌ కొన్న గంటకే రూ.కోటి జాక్‌పాట్‌!

|

Jul 17, 2023 | 7:40 AM

అదృష్టం అతన్ని గంట వ్యవధిలోనే కోటీశ్వరుడ్ని చేసింది. కోటి రూపాయల జాక్‌పాట్‌ కొట్టి వార్తల్లో నిలిచాడు. పంజాబ్‌లోని ఈ వ్యక్తి కథ ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. అసలు విషయమేమంటే..

Lottery Ticket: అదృష్టం అంటే ఇదీ.. లాటరీ టికెట్‌ కొన్న గంటకే రూ.కోటి జాక్‌పాట్‌!
Lottery Ticket
Follow us on

గురుదాస్‌పూర్‌, జులై 17: అదృష్టం అతన్ని గంట వ్యవధిలోనే కోటీశ్వరుడ్ని చేసింది. కోటి రూపాయల జాక్‌పాట్‌ కొట్టి వార్తల్లో నిలిచాడు. పంజాబ్‌లోని ఈ వ్యక్తి కథ ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. అసలు విషయమేమంటే..

పంజాబ్‌లోని గురుదాస్‌పుర్‌ జిల్లా హల్కా డేరా బాబా నానక్‌ టౌన్‌కు చెందిన రూపీందర్‌జిత్‌ సింగ్‌ అగ్రికల్చర్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌లో క్లర్కుగా పని చేస్తున్నాడు. ఎలాగైనా కోటీశ్వరుడు కావాలనే ఆశతో ఈయన గత ఏడాది కాలంగా లాటరీ టికెట్లు కొంటున్నాడు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు నాగాలాండ్‌ ఏజెంట్‌ నుంచి 25 లాటరీ టికెట్లు ఒక్కోటి రూ.6 చొప్పున కొనుగోలు చేశాడు. తర్వాత బ్యాంకుకు వెళ్లి తన పనిలో నిమగ్నమైపోయాడు.

ఇంతలో గంట సేపటి తర్వాత అంటే సరిగ్గా ఒంటి గంటకి రూపిందర్‌జిత్‌కి ఫోన్‌ వచ్చింది. కంగ్రాచ్యులేషన్స్‌.. మీరు రూ.కోటి గెలుచుకున్నారంటూ లాటరీ ఏజెంటు ఫోన్‌లో తెలిపాడు. దీంతో తోటి బ్యాంకు సిబ్బంది రూపీందర్‌జిత్‌ను చుట్టుముట్టి అభినందనల్లో ముంచెత్తారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ బల్జీందర్ సింగ్, కన్వల్‌జిత్ సింగ్ భిందర్, హర్మన్‌దీప్ సింగ్, ఇతర ఉద్యోగులు స్వీట్స్‌ పంచి ఆనందాన్ని పంచుకున్నారు. ఇదంతా చూస్తుంటే తనకు కలగా ఉందనీ, ఇన్నాళ్ల తన కల నిజమైనందుకు చాలా సంతోషంగా ఉందని రూపీందర్‌జిత్‌ అన్నాడు.

ఇవి కూడా చదవండి

లాటరీలో గెలుచుకున్న డబ్బుతో తన పిల్లలు, కుటుంబ భవిష్యత్తు కోసం ఖర్చు చేస్తానన్నాడు. పేదల కోసం కూడా కొంత డబ్బు ఖర్చు చేస్తానన్నాడు. బ్యాంక్‌ క్లర్క్‌ రూపీందర్ లాటరీ ప్రైజ్ గెల్చుకోవడంతో డేరా బాబా నానక్​ టౌన్​ పేరు మరోసారి మారుమోగింది. గతంలో ఇదే ప్రాంతంలో ఓ కిరాణా దుకాణం యజమాని రూ.2.5 కోట్ల లాటరీ ప్రైజ్‌ను గెలిచిన సంగతి తెలిసిందే.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.