Heart Attack: మరో మరణం…జిమ్‌లో వర్కౌట్స్‌ చేస్తుండగా ఆగిన గుండె..

6 నెలల క్రితం తన ఇంటికి సమీపంలోని జిమ్‌లో జాయిన్ అయిన కులకర్ణి.. వీలు దొరికినప్పుడల్లా అక్కడికి వెళ్లి వ్యాయామం చేసేవాడు. ఈ క్రమంలోనే శుక్రవారం కూడా జిమ్‌కు వెళ్లిన కులకుర్ణి వ్యాయామం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, జిమ్‌లోని...

Heart Attack: మరో మరణం...జిమ్‌లో వర్కౌట్స్‌ చేస్తుండగా ఆగిన గుండె..
Gym Workout Death

Updated on: Aug 02, 2025 | 11:21 AM

గత కొద్ది రోజులుగా జిమ్‌లో వర్కౌట్‌ల సమయంలో మరణాల సంఘటనలు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా గుండెపోటు, ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా హార్ట్‌ఎటాక్‌ ఘటనలు విపరీతంగా పెరిగిపోయాయి. గత నెల అంటే జూలైలో హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలోని జిమ్‌లో వర్కౌట్ చేస్తున్నప్పుడు 35 ఏళ్ల పంకజ్ శర్మ గుండెపోటుతో మరణించాడు. ట్రైసెప్స్ వ్యాయామం చేస్తూ అతను అకస్మాత్తుగా పడిపోయాడని, ఆ తర్వాత అతను లేవలేకపోయాడని సీసీటీవీ ఫుటేజ్‌లో తేలింది. తాజాగా మహారాష్ట్రాలోనూ ఇలాంటి విషాద సంఘటన చోటు చేసుకుంది.

మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది. పింప్రి-చించ్‌వాడ్‌లోని ఓ జిమ్ సెంటర్‌లో వ్యాయామం చేస్తూ శుక్రవారం మిలింద్ కులకర్ణి (37) అనే వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలి మృతిచెందాడు. 6 నెలల క్రితం తన ఇంటికి సమీపంలోని జిమ్‌లో జాయిన్ అయిన కులకర్ణి.. వీలు దొరికినప్పుడల్లా అక్కడికి వెళ్లి వ్యాయామం చేసేవాడు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఈ క్రమంలోనే శుక్రవారం కూడా జిమ్‌కు వెళ్లిన కులకుర్ణి వ్యాయామం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, జిమ్‌లోని CCTV ఫుటేజ్‌ వెలుగులోకి వచ్చింది. ఇప్పుడా వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..