PM Modi: బీజేపీపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది.. ఎనిమిదేళ్ల పాలన సందర్భంగా ప్రధాని కామెంట్

PM Modi: బీజేపీపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది.. ఎనిమిదేళ్ల పాలన సందర్భంగా ప్రధాని కామెంట్
Pm Modi

2014 తర్వాత ప్రభుత్వ పాలనపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) అన్నారు. ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జైపుర్ లో నిర్వహించిన పార్టీ సభ్యుల కార్యక్రమంలో....

Ganesh Mudavath

| Edited By: Janardhan Veluru

May 21, 2022 | 3:10 PM

2014 తర్వాత ప్రభుత్వ పాలనపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) అన్నారు. ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జైపుర్ లో నిర్వహించిన పార్టీ సభ్యుల కార్యక్రమంలో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ విధానంలో పాల్గొన్నారు. భాషా ప్రాతిపదికన వివాదాలు ప్రేరేపించే విషయాల గురించి పౌరులను అప్రమత్తం చేయాలని ప్రధాని సూచించారు. భారతీయ(India) భాషలన్నింటినీ బీజేపీ దేశ ఆత్మగా పరిగణిస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలుచేస్తోన్న సంక్షేమ పథకాలు పేదలు, అణగారిన వర్గాల వారికి తప్పకుండా అందేటట్లు చూడాలని భాజపా కార్యకర్తలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. భారతదేశ సాంస్కృతికం, భాష వైవిధ్యం దేశానికి కీలకమని వ్యాఖ్యానించారు. మోడీ ప్రభుత్వం ప్రాంతీయ భాషలను పణంగా పెట్టి హిందీకి ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నిస్తోందని దక్షిణ భారతదేశానికి చెందిన అనేక ప్రాంతీయ పార్టీల ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ చేసిన వాదనతో బీజేపీ ప్రత్యర్థులు భాషలపై గొడవకు దిగారు. వివాదం హిందీ భారతదేశంలోని ఇతర భాషల లాంటిదని, జాతీయ భాష కాదని మాట్లాడిన వారిలో రాజకీయ నాయకులతో పాటు సినీ ప్రముఖులూ ఉన్నారు.

ఈ నెలతో ఎన్‌డీఏ ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాలనను పూర్తి చేసుకుంటుంది. ఈ ఎనిమిదేళ్లలో ఎన్నో తీర్మానాలు, విజయాలు సాధించాం. ప్రజలకు సేవ చేయడం, సుపరిపాలన, పేద ప్రజల సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేశాం. ముఖ్యంగా సన్నకారు రైతులు, కార్మికులు, మధ్యతరగతి కుటుంబాల ఆశలు నెరవేరాయని అన్నారు. సంతులిత అభివృద్ధితో ముందుకెళ్తూనే సామాజిక న్యాయం, సామాజిక భద్రతతోపాటు మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నామన్నారు.

           –  ప్రధాని నరేంద్ర మోడీ

ఎన్నో అంచనాలతో యావత్‌ ప్రపంచం భారత్‌వైపే చూస్తుందన్న ప్రధాని.. దేశంలోని ప్రజలు కూడా బీజేపీ వైపు ఆశగా చూస్తున్నారని అన్నారు. ఇలా దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు పెరగడంతో ప్రభుత్వం బాధ్యత కూడా మరింత పెరిగిందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీ చదవండి

Samantha: వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న సమంత.. మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ?

Neha Shetty: డీజే టిల్లు బ్యూటీ నేహశెట్టి లేటెస్ట్ ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే..

ఇవి కూడా చదవండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu