psycho killers: బాబోయ్‌.. సైకో కిల్లర్స్‌.. హైవేపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు..

|

Sep 14, 2022 | 9:10 AM

మోటారు సైకిల్‌పై వచ్చిన ముష్కరులు రద్దీగా ఉండే ప్రాంతంలోని దుకాణాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఆ తర్వాత ముష్కరులు..

psycho killers: బాబోయ్‌..  సైకో కిల్లర్స్‌.. హైవేపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు..
Psycho Killers
Follow us on

psycho killers: పట్టణంలోనే అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో మోటార్‌ సైకిళ్లపై వచ్చిన దుండగులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఏం జరిగిందో అర్థంకాక అక్కడి స్థానికులు, ప్రయాణికులు భయంతో కేకలు వేస్తూ ప్రాణాల కోసం పరుగులు తీశారు. అక్కడి దుకాణదారులు సైతం తమ దుకాణాలు తెరిచి ఉంచే అక్కడ్నుంచి పారిపోయారు. ఈ బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలో చోటు చేసుకుంది. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రజలపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. దుండగుల కాల్పుల్లో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ముష్కరులను ఇంకా గుర్తించలేదని తెలిసింది. కానీ ప్రజలు వారిని సైకో కిల్లర్లుగా పిలుస్తున్నారు.

ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బెగుసరాయ్ పట్టణంలోని మల్హిపూర్ చౌక్ వద్దకు మోటారు సైకిల్‌పై వచ్చిన ముష్కరులు రద్దీగా ఉండే ప్రాంతంలోని దుకాణాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఆ తర్వాత ముష్కరులు బరౌనీ థర్మల్ చౌక్, బరౌనీ, తేఘ్రా, బచ్వారా, రాజేంద్ర బ్రిడ్జికి వెళ్లి విచక్షణారహితంగా ప్రజలపై కాల్పులు కొనసాగించారు. ఈ అల్లర్లలో చందన్ కుమార్ అనే 30 ఏళ్ల వ్యక్తి మృతి చెందగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరిని బెగుసరాయ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా, మరికొందరిని మెరుగైన వైద్యం కోసం పాట్నాకు తరలించారు.

ఇవి కూడా చదవండి

బెగుసరాయ్‌లో కాల్పులు జరిగిన తర్వాత పాట్నా అప్రమత్తమైంది. నేరస్తులు పాట్నా వైపు పరుగులు తీశారని తెలిసిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. పాట్నాలో భద్రతను కట్టుదిట్టం చేశామని, సంఘటన తర్వాత అన్ని ఎంట్రీ పాయింట్లను అడ్డుకున్నామని ఏడీజీ హెడ్‌క్వార్టర్స్ జితేంద్ర సింగ్ గంగ్వార్ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి