పౌరసత్వ చట్టానికి ఏకకాలంలో ‘ సెగ ‘.. 10 నగరాల్లో ప్రదర్శనలు.. అయితే…

కొత్త పౌరసత్వ చట్టానికి నిరసనగా ఒకేసారి దేశంలోని 10 నగరాల్లో గురువారం ప్రదర్శనలు నిర్వహించాలని విద్యార్థులు, ప్రజలు యోచిస్తున్నారు. ఢిల్లీ, లక్నో, బెంగుళూరు తదితర సిటీల్లో వీటి నిర్వహణకు ప్లాన్ చేశారు. అయితే పోలీసులు మాత్రం ఇందుకు ‘ నో ‘ అంటున్నారు. వీటికి అనుమతినిచ్ఛే ప్రసక్తే లేదంటున్నారు. హైదరాబాద్, ముంబై, చెన్నై, పూణే, నాగపూర్, భువనేశ్వర్, కోల్ కతా, భోపాల్ నగరాల్లో ఎలాంటి ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు జరగరాదంటూ ఆంక్షలు విధించారు. హస్తినలో ప్రొటెస్ట్ ర్యాలీని […]

పౌరసత్వ చట్టానికి ఏకకాలంలో ' సెగ '.. 10 నగరాల్లో ప్రదర్శనలు.. అయితే...

కొత్త పౌరసత్వ చట్టానికి నిరసనగా ఒకేసారి దేశంలోని 10 నగరాల్లో గురువారం ప్రదర్శనలు నిర్వహించాలని విద్యార్థులు, ప్రజలు యోచిస్తున్నారు. ఢిల్లీ, లక్నో, బెంగుళూరు తదితర సిటీల్లో వీటి నిర్వహణకు ప్లాన్ చేశారు. అయితే పోలీసులు మాత్రం ఇందుకు ‘ నో ‘ అంటున్నారు. వీటికి అనుమతినిచ్ఛే ప్రసక్తే లేదంటున్నారు. హైదరాబాద్, ముంబై, చెన్నై, పూణే, నాగపూర్, భువనేశ్వర్, కోల్ కతా, భోపాల్ నగరాల్లో ఎలాంటి ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు జరగరాదంటూ ఆంక్షలు విధించారు. హస్తినలో ప్రొటెస్ట్ ర్యాలీని రెడ్ ఫోర్ట్ నుంచి నిర్వహించాలని నిర్ణయించుకోగా.. ఇందుకు తాము అనుమతించబోమని ఖాకీలు ఓ లేఖ ద్వారా తెలిపారు. శాంతి భద్రతలు, ట్రాఫిక్ దృష్ట్యా తాము పర్మిషన్ ఇవ్వడంలేదన్నారు. అయితే నిరసనకారులు వెనక్కి తగ్గలేదు. తాము ఈ దేశ ప్రజలమని, నిరసన ప్రదర్శన నిర్వహించి తీరుతామని అంటూ సోషల్ మీడియా ద్వారా మెసేజులు పంపారు.

బెంగుళూరులో ఉదయం పది గంటలకు ప్రదర్శన ప్రారంభించాలన్న నిరసనకారుల ప్లాన్ కు పోలీసులు మోకాలడ్డారు. తాము ఇందుకు అనుమతించబోమని పోలీస్ కమిషనర్ భాస్కరరావు స్పష్టం చేశారు. అలాగే.. యూపీలో అనేకప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉందని, ఎలాంటి ర్యాలీలకు పర్మిషన్ లేదని ఆ రాష్ట్ర పోలీసులు ప్రకటించారు. భువనేశ్వర్ లో ఉదయం 10గంటలకు, భోపాల్ లో మధ్యాహ్నం 2 గంటలకు, చెన్నైలో మధ్యాహ్నం మూడింటికి, హైదరాబాద్ లో సాయంత్రం 4 గంటలకు, పూణేలో సాయంత్రం నాలుగున్నర గంటలకు ర్యాలీలు జరుగుతాయని నిర్వాహకులు ప్రకటించారు. కోల్ కతాలో సీఎం మమతా బెనర్జీ ఆధ్వర్యాన నిరసన ప్రదర్శన జరగనుంది. కేరళ, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ చట్టాన్ని అమలు చేయబోమని ప్రకటించారు.