రైతుల ట్రాక్టర్ ర్యాలీపై నిషేధం విధించాలంటూ కేంద్రం పిటిషన్‌.. సుప్రీంకోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ

రైతుల ట్రాక్టర్ ర్యాలీపై నిషేధం విధించాలంటూ కేంద్రం పిటిషన్‌.. సుప్రీంకోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ

ఢిల్లీలో గణతంత్ర వేడుకల వేళ రైతుసంఘాలు తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీపై ఉత్కంఠ నెలకొంది. లక్ష ట్రాక్టర్లతో రిపబ్లిక్‌డే నాడు ర్యాలీ నిర్వహిస్తామని రైతు సంఘాలు ప్రకటించాయి. అయితే..

Sanjay Kasula

|

Jan 17, 2021 | 8:43 PM

Protesting Farmers :  ఢిల్లీలో గణతంత్ర వేడుకల వేళ రైతుసంఘాలు తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీపై ఉత్కంఠ నెలకొంది. లక్ష ట్రాక్టర్లతో రిపబ్లిక్‌డే నాడు ర్యాలీ నిర్వహిస్తామని రైతు సంఘాలు ప్రకటించాయి. అయితే ట్రాక్టర్‌ ర్యాలీతో ఢిల్లీలో శాంతిభద్రతల సమస్య వచ్చే ప్రమాదముందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ట్రాక్టర్‌ ర్యాలీపై నిషేధం విధించాలని సుప్రీంకోర్టులో కేంద్రం వేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ జరుగనుంది.

అయితే తాము శాంతియుతుంగా ర్యాలీ నిర్వహిస్తామని రైతు సంఘాలు ప్రకటించాయి. గణతంత్ర వేడుకలును అడ్డుకోబోమని స్పష్టం చేశాయి. ఢిల్లీ ఔటర్‌ రింగ్‌రోడ్డు దగ్గర ట్రాక్టర్‌ ర్యాలీ ఉంటుందని వివరణ ఇచ్చాయి. వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఆందోళన చేస్తున్న రైతు సంఘాల నేతలకు ఎన్‌ఐఏ నోటీసులు ఇవ్వడం విడ్దూరంగా ఉందని విమర్శించాయి. నిషేధిత ఖలిస్తాన్‌ ఉగ్రవాద సంస్థలతో సంబంధాల పేరిటన 40 మంది రైతు సంఘాలకు నోటీసులు ఇచ్చారని విమర్శించారు.

రైతు సంఘాలతో కేంద్రం మంగళవారం మరోసారి భేటీ అవుతుంది. కొత్త వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించిందని, చట్టాల రద్దు మినహా రైతుల అన్ని డిమాండ్లను పరిష్కరించేందుకు కేంద్రం సిద్దంగా ఉందన్నారు వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌.

సుప్రీంకోర్టు చట్టాల అమలుపై స్టే విధించింది. చట్టాలను ఇప్పుడు అమలు చేయడం లేదు. 19వ తేదీన రైతులు క్లాజ్‌ వైజ్‌ క్లాజ్‌గా చర్చలు జరపాలి. చట్టాల రద్దు మినహా మిగతా డిమాండ్లను ముందు పెడితే పరిష్కరిస్తాం అని తెలిపారు. కొత్త వ్యవసాయ చట్టాల అమలుతో రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అన్నారు.

ఇదిలావుంటే.. దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 26న జరిగే ట్రాక్టర్​ ర్యాలీలో పాల్గొనడానికి పంజాబ్​ లూథియానా నుంచి పెద్ద సంఖ్యలో రైతులు బయలుదేరారు.

ఇవి కూడా చదవండి :

COVID-19 vaccine drive: రెండో ఆరు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌ డ్రైవ్.. 17,072 మందికి టీకా..

అణువణువూ గాలించారు.. షార్ప్‌ షూటర్స్‌ను తీసుకొచ్చారు.. నో ఛాన్స్.. దొరకని పులి.. నెక్స్ట్ ఏంటి..!

సీనియర్​ రైల్వే అధికారిని అరెస్ట్ చేసిన సీబీఐ.. కోటి రూపాయలు లంచం తీసుకున్నట్లు అభియోగం

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu