PM Modi: హెల్త్‌కేర్ హబ్‌గా ప్రసిద్ధి చెందుతోన్న కాశీ.. శంకర కంటి ఆసుపత్రి సహా పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధాని మోడీ

|

Oct 20, 2024 | 8:13 PM

ఇప్పుడు కాశీ హెల్త్‌కేర్ హబ్‌గా కూడా ప్రసిద్ధి చెందుతోంది. వారణాసిలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో శంకర కంటి ఆసుపత్రిని ప్రారంభించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఆసుపత్రి వృద్ధులకు సేవ చేస్తుందని.. పిల్లల జీవితాల్లో కూడా వెలుగులు నింపుతుందని అన్నారు. కాశీకి రావడం వలన పుణ్యం సంపాదించుకోవచ్చు అని మన నమ్మకం.. అదే పుణ్యక్షేత్రం కాశీ ఇప్పుడు పెద్ద హెల్త్‌కేర్ హబ్‌గా ఎదుగుతోందని చెప్పారు ప్రధాని..

PM Modi: హెల్త్‌కేర్ హబ్‌గా ప్రసిద్ధి చెందుతోన్న కాశీ.. శంకర కంటి ఆసుపత్రి సహా పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధాని మోడీ
Pm Modi In Kashi
Follow us on

ప్రధాని నరేంద్ర మోడీ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో పర్యటిస్తున్నారు. అక్కడ శంకర కంటి ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ, ఈ ఆసుపత్రి వారణాసి సహా ఈ ప్రాంతం సమీపంలోని అనేక మంది ప్రజల జీవితాల్లోని చీకటిని తొలగించి.. వారిని వెలుగులోకి తీసుకువెళుతుందని అన్నారు. ఈ ఆసుపత్రి వృద్ధులకు కూడా సేవలందిస్తుంది. పిల్లలకు కూడా వెలుగునిస్తుంది. ఈ ఆస్పత్రిలో భారీ సంఖ్యలో పేదలకు ఉచితంగా వైద్యం అందించనుంది. ఈ ఆసుపత్రి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను తీసుకొచ్చింది.

కాశీ ఎప్పటి నుంచో మతం, సంస్కృతికి రాజధానిగా గుర్తింపు పొందిందని ప్రధాని మోడీ అన్నారు. ఇప్పుడు కాశీ ఉత్తరప్రదేశ్ , పూర్వాంచల్ లకు ఒక పెద్ద ఆరోగ్య కేంద్రంగా ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. కాశీ ప్రాచీన కాలం నుంచి మతం, సంస్కృతికి సంబంధించిన రాజధానిగా గుర్తించబడింది. ఇప్పుడు కాశీ ఉత్తరప్రదేశ్, పూర్వాంచల్ లకు ఆరోగ్య కేంద్రం, ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందింది.

కార్తీక మాసంలో కాశీ ప్రయాణం

కార్తీక మాసాన్ని పవిత్ర మాసంగా భావిస్తారు. ఈ పవిత్ర మాసంలో కాశీకి రావడం పుణ్యం దక్కుతుందని నమ్మకం. ఈ పవిత్ర క్షేత్రంలో కాశీవాసులు ఉండటమే కాదు, సాధువులకు, పరోపకుల ఆవాసం కూడా. ఇంతకంటే ఆనందకరమైన సంఘటన ఏముంటుంది.. ఇప్పుడు తనకు అత్యంత పూజ్యమైన శంకరాచార్య గారి దర్శనం, ప్రసాదం , ఆశీస్సులు పొందే భాగ్యం కలిగిందన్నారు ప్రధాని.

ఇవి కూడా చదవండి

ఈ రోజు ఆరోగ్యానికి సంబంధించిన భారతదేశ వ్యూహంలో ఐదు స్తంభాలు ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఇందులో మొదటి మూలస్తంభం నివారణ ఆరోగ్య సంరక్షణ అంటే వ్యాధి రాకముందే నివారణ. రెండవది సకాలంలో వ్యాధి నిర్ధారణ, మూడవది ఉచిత చికిత్స లేదా తక్కువ ధరలో చికిత్స, మంచి మందులు. నాల్గవది చిన్న పట్టణాలలో మంచి వైద్యం అందించడం, వైద్యుల కొరతను అధిగమించడం .. ఐదవది ఆరోగ్య సంరక్షణలో సాంకేతికతను విస్తరించడమని చెప్పారు.

సిగ్రాలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ 6700 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఇందులో 23 అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల్లో రూ.3,200 కోట్ల కంటే ఎక్కువ విలువైన 16 అభివృద్ధి ప్రాజెక్టులు వారణాసికి సంబంధించినవే కావడం విశేషం.

దాదాపు రూ. 2870 కోట్లతో వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వే విస్తరణ, కొత్త టెర్మినల్ భవనం, అనుబంధ పనులకు కూడా ప్రధాన మంత్రి మోడీ శంకుస్థాపన చేశారు.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..