Gandhi Jayanti 2021: మహాత్ముని జీవితం అందరికీ ఆదర్శం.. గాంధీకి నివాళులర్పించిన ప్రధాని మోదీ..

|

Oct 02, 2021 | 8:45 AM

PM Modi pays tribute to Mahatma Gandhi: మహాత్మా గాంధీ 152వ జయంతి సందర్భంగా ప్రధానమత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. శనివారం ఉదయాన్నే

Gandhi Jayanti 2021: మహాత్ముని జీవితం అందరికీ ఆదర్శం.. గాంధీకి నివాళులర్పించిన ప్రధాని మోదీ..
Modi
Follow us on

PM Modi pays tribute to Mahatma Gandhi: మహాత్మా గాంధీ 152వ జయంతి సందర్భంగా ప్రధానమత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. శనివారం ఉదయాన్నే ప్రధాని మోదీ రాజ్‌ఘాట్‌కు చేరుకుని మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఆయనతోపాటు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా గాంధీకి నివాళులర్పించారు. వారితోపాటు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ తాత్కలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా రాజ్‌ఘాట్‌కు చేరుకుని బాపూజీకి నివాళులర్పించారు. అనంతరం ప్రధాని మోదీ విజయ్ ఘాట్‌కు చేరుకుని మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి నివాళులర్పించారు.

కాగా.. ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా.. ప్రధాని మోదీ.. ప్రధానమంత్రి జల జీవన్ మిషన్ యాప్‌ని ప్రారంభించనున్నారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరిగే జల్ జీవన్ మిషన్‌ ప్రారంభోత్సవంలో గ్రామ పంచాయతీల్లోని నీరు, పారిశుద్ధ్య కమిటీలతో (VWSC) సంభాషించనున్నారు.

Also Read:

Telugu Academy: తెలుగు అకాడమీ నిధుల గల్లంతు విధంబెట్టిదనిన.. కేటుగాళ్ల జాబితా చాంతాడంత.!

Amazon Great Indian: ప్రైమ్‌ మెంబర్స్‌కు ఆఫర్ల పండుగ ఒకరోజు ముందే ప్రారంభమైంది.. ఈ భారీ డిస్కౌంట్లను గమనించారా?