
డిజిటల్ ఇండియా ప్రారంభించి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా లబ్ధిదారులతో ఇంటరాక్ట్ అయ్యారు ప్రధాని మోడీ. వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిజిటల్ ఇండియాకు సంబంధించి వేర్వేరు స్కీమ్స్‌లో విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సుహానీ సాహు, దీక్ష అనే లబ్ధిదారులతో ప్రధాని ముచ్చటించారు.
5 వ తరగతి చదువుతున్న విద్యార్థి సుహానీ సాహు తన అధ్యయనాల వివరాలను ప్రధానితో పంచుకున్నారు. సుహానీ సాహు మాట్లాడుతూ… “మేము వాట్సాప్‌లో ఒక లింక్‌ను అందుకుంన్నాము. అక్కడ మేము చాలా విషయాలు నేర్చుకుంటున్నాము. ప్లాట్‌ఫారమ్‌లో చాలా కార్టూన్లు కూడా ఉన్నాయి” అని చిన్నారు ప్రధానితో వివరించారు.
ఈ ఆరేళ్ల కాలంలో టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు కేంద్రం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు ప్రధాని మోదీ. సాంకేతికత సాధికారతలో డిజిటల్ ఇండియాది కీలక పాత్ర అని తెలిపారు.
డిజిటల్ ఇండియా సాధించిన విజయాలు, ఫ్యూచర్ ప్లాన్ గురించి వివరించారు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్. ప్రభుత్వానికి ప్రజలను దగ్గర చేయడంలో డిజిటల్ ఇండియా కీలక పాత్ర పోషించిందన్నారు.