Aero India 2023: ఏరో ఇండియా 2023 ప్రారంభించిన ప్రధాని మోదీ.. ఆకాశంలో కనువిందు చేసిన సారంగ్

|

Feb 13, 2023 | 10:55 AM

ఏరో ఇండియా షోను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీఎం బసవరాజ్ బొమ్మై , గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్..

Aero India 2023:  ఏరో ఇండియా 2023 ప్రారంభించిన ప్రధాని మోదీ.. ఆకాశంలో కనువిందు చేసిన సారంగ్
PM Modi Inaugurates Aero India
Follow us on

ఏరో ఇండియా షో 14వ ఎడిషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. యలహంక ఎయిర్ బేస్‌లో ఐదు రోజుల పాటు జరిగే ఏరో ఇండియా షోను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీఎం బసవరాజ్ బొమ్మై , గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ , పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. భారత రక్షణ దళాల ప్రత్యేక క్యాప్ ధరించి ప్రధాని రావడం విశేషం. ప్రధాన మంత్రి ఎయిర్ షోను ప్రారంభించగా.. సారంగ్ హెలికాప్టర్ల వంటి యుద్ధ విమానాలు అకాశంలో కనువిందు చేశాయి.

భారతదేశం గర్వించదగిన ఈ రక్షణ, వైమానిక ప్రదర్శనలో 98 దేశాలు పాల్గొంటున్నాయి . ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆదివారం నాడు సమాచారం వెళ్లడించారు. ఏరో ఇండియా షోలో కేవలం ఎయిర్ పవర్ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 809 కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. అందుకోసం యలహంకలోని ఐఏఎఫ్ స్టేషన్‌లో 35 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేశారు .

ఇవి కూడా చదవండి

మంగళవారం జరుగుతున్న ఈ వేడుకల్లో 32 దేశాల రక్షణ మంత్రులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి 29 దేశాల వైమానిక దళాధిపతులు హాజరుకానున్నారు. రక్షణ రంగంలోని గ్లోబల్‌ కంపెనీల సీఈవోల రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మొత్తం 73 మంది సీఈవోలు హాజరుకావచ్చు. బోయింగ్ , లాక్హీడ్ మార్టిన్ , ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ , జనరల్ అటామిక్స్ , లైబర్ గ్రూప్ , రేథియాన్ టెక్నాలజీస్ , సఫ్రాన్ , జనరల్ అథారిటీ ఆఫ్ మిలిటరీ ఇండస్ట్రీస్ ( GAMI ) వంటి గ్లోబల్ కంపెనీలు పాల్గొంటున్నాయి .HAL , BEL , BDL , బెమెల్ , మిశ్రా ధాతు నిగమ్ వంటి భారత రక్షణ రంగ సంస్థలు కూడా తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి.

ఒక అంచనా ప్రకారం, ఈ సంవత్సరం ఏరో ఇండియా షోలో 251 ఒప్పందాలు (MOU) కుదుర్చుకునే అవకాశం ఉంది . ఇది నెరవేరితే భారత ఆర్థిక వ్యవస్థకు 75 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయి. హెచ్‌ఏఎల్‌కు అనేక కాంట్రాక్టులు లభిస్తాయని అంచనా..

మరొక నివేదిక ప్రకారం, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన స్టెల్త్ ఫైటర్, అమెరికన్ F- 35 ఫైటర్ జెట్, యలహంక ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ప్రదర్శించబడే అవకాశం ఉంది . F- 35 ఫైటర్ జెట్ రాకపోయినా, F -16 వంటి అమెరికాకు చెందిన మరికొన్ని ముఖ్యమైన యుద్ధ విమానాలు ఏరో ఇండియా షోలో ప్రదర్శన ఇవ్వనున్నాయి .

మరిన్ని జాతీయ వార్తల కోసం