AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: సామాజికవేత్త కర్పూరి ఠాకూర్‎పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక కథనం

ప్రముఖ సామాజిక వేత్త, ప్రజా సంక్షేమం కోసం నిర్విరామంగా శ్రమించిన పేదవాడు, ప్రజల మనసున సుస్థిర స్థానం సంపాధించుకున్న జననాయకుడు కార్పూరి ఠాకూర్ 100వ జయంతి నేడు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్పందించారు. ఆయనను, ఆయన చేసిన పనులను గుర్తుచేసుకుంటూ తన భావనలను ఒక లేఖ రూపంలో కథనంగా రాశారు.

PM Modi: సామాజికవేత్త కర్పూరి ఠాకూర్‎పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక కథనం
Pm Modi And Karpoori Thakur
Srikar T
|

Updated on: Jan 24, 2024 | 7:39 AM

Share

ప్రముఖ సామాజిక వేత్త, ప్రజా సంక్షేమం కోసం నిర్విరామంగా శ్రమించిన పేదవాడు, ప్రజల మనసున సుస్థిర స్థానం సంపాధించుకున్న జననాయకుడు కార్పూరి ఠాకూర్ 100వ జయంతి నేడు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్పందించారు. ఆయనను, ఆయన చేసిన పనులను గుర్తుచేసుకుంటూ తన భావనలను ఒక లేఖ రూపంలో కథనంగా రాశారు. అందులో పేర్కొన్న కొన్ని అంశాలు ఇప్పుడు పరిశీలిద్దాం. ‘చాలా మంది వ్యక్తుల వ్యక్తిత్వం మన జీవితాలపై ప్రభావం చూపుతుంది. మనం కలిసే వ్యక్తులు. మనకు పరిచయం ఉన్నవారి మాటలు ప్రభావం చూపడం సహజం. కానీ మీరు వారి గురించి వినడం ద్వారా ఇంప్రెస్ అయిన వ్యక్తులు కొందరు ఉన్నారు. జననాయక్ కర్పూరి ఠాకూర్ తనకు ఇలాగే ఉన్నారని మోదీ పేర్కొన్నారు.

నేడు కర్పూరి బాబు 100వ జయంతి. కర్పూరి జీని కలిసే అవకాశం నాకు ఎప్పుడూ రాలేదు, కానీ ఆయనతో చాలా సన్నిహితంగా పనిచేసిన కైలాసపతి మిశ్రా జీ నుండి నేను అతని గురించి చాలా విన్నాను. సామాజిక న్యాయం కోసం కర్పూరి బాబు చేసిన కృషి.. కోట్లాది మంది జీవితాల్లో పెనుమార్పు తెచ్చింది. అతను బార్బర్ కమ్యూనిటీకి చెందినవాడు, అంటే సమాజంలోని అత్యంత వెనుకబడిన తరగతి. ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ ఎన్నో విజయాలు సాధించి జీవితాంతం సమాజ అభ్యున్నతికి పాటుపడ్డారు. జననాయక్ కర్పూరి ఠాకూర్ జీ జీవితమంతా సామాజిక న్యాయానికి అంకితం చేయబడిందని పేర్కొన్నారు. తన చివరి శ్వాస వరకు, అతను తన సాధారణ జీవనశైలితో పాటు వినయపూర్వకమైన స్వభావం కారణంగా సామాన్య ప్రజలతో లోతైన అనుబంధాన్ని కలిగి ఉన్నారని కొనియాడారు. ఆయనకు సంబంధించి ఇలాంటి కథలు చాలానే ఉన్నాయని రాసుకొచ్చారు మోదీ.

ప్రభుత్వ సొమ్ములో ఒక్క పైసా కూడా తన వ్యక్తిగత పనుల్లో వినియోగించకూడదని ఆయన పట్టుబట్టిన తీరును ఆయనతో కలిసి పనిచేసిన వారు గుర్తు చేసుకున్నారు. ఆయన సీఎంగా ఉన్న సమయంలో బీహార్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. అప్పుడు రాష్ట్రంలోని నాయకుల కోసం కాలనీ నిర్మించాలని నిర్ణయించారు. అయితే తన కోసం ఎలాంటి భూమి తీసుకోలేదు. ఎందుకు భూమిని తీసుకోవడం లేదని ప్రశ్నించారు కొందరు. 1988లో ఆయన మరణించినప్పుడు పలువురు నాయకులు ఆయన గ్రామానికి వెళ్లి నివాళులర్పించారు. కర్పూరి జీ ఇంటి పరిస్థితి చూసి, ఇంత ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తికి ఇంత సాదాసీదా ఇల్లు ఎలా ఉంటుందోనని కళ్లలో నీళ్లు తిరిగిన సంఘటనను తన లేఖలో పొందుపరిచారు మోదీ.

ఇవి కూడా చదవండి

కర్పూరి బాబు సింప్లిసిటీకి సంబంధించిన మరో కథ 1977 జరిగింఇ. బీహార్ సీఎం అయ్యాక.. ఆ సమయంలో కేంద్రంలో, బీహార్‌లో జనతా ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ సమయంలో, జనతా పార్టీ నాయకుడు లోక్‌నాయక్ జైప్రకాష్ నారాయణ్ పుట్టినరోజు కోసం చాలా మంది నాయకులు పాట్నాలో గుమిగూడారు. అందులో పాల్గొన్న ముఖ్యమంత్రి కర్పూరి బాబు కుర్తా చిరిగిపోయింది. అటువంటి పరిస్థితిలో, చంద్రశేఖర్ జీ తన ప్రత్యేక శైలిలో కొంత డబ్బును విరాళంగా ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తద్వారా కర్పూరి జీ కొత్త కుర్తాను కొనుగోలు చేయవచ్చు. కానీ కర్పూరీ జీ ఇందులోనూ ఆయన ఆదర్శంగా నిలిచారు. అతను డబ్బును స్వీకరించాడు, కానీ దానిని ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చాడు.భారతదేశంలోని 25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుండి బయటికి తీసుకొచ్చినందుకు ఈ రోజు జననాయక్ కర్పూరి జీ ఖచ్చితంగా గర్వపడతారని నేను నమ్మకంగా, గర్వంగా చెప్పగలనన్నారు ప్రధాని.

స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్నా సమాజంలోని అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందిన వారే కనీస సౌకర్యాలు లేకుండా..పేదరికం నుంచి బయటపడే అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఈరోజు మేము 100 శాతం లబ్ధిదారులు ప్రతి పథకం నుంచి ప్రయోజనాలను పొందేలా ప్రణాళికలు రచించామని చెప్పుకొచ్చారు. నేడు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజిక వర్గాల ప్రజలు ముద్ర లోన్ ద్వారా వ్యవస్థాపకులుగా మారుతున్నారు. ఇది కర్పూరీ ఠాకూర్ జీ ఆర్థిక స్వాతంత్ర్య కలలను నెరవేరుస్తోంది అని తెలిపారు. వెనుకబడిన తరగతికి చెందిన వ్యక్తిగా తాను జన్నాయక్‌ కర్పూరీ ఠాకూర్‌జీ జీవితం నుంచి చాలా నేర్చుకున్నానని తన కథనంలో వివరించారు. కర్పూరి బాబు గారు నాలాంటి చాలా మంది జీవితాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకారం అందించారన్నారు. దీనికి ఎల్లప్పుడూ కృతజ్ఞుడుగా ఉంటాన్నారు ప్రధాని మోదీ.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..