CBI-CVC Conference: ప్రజల నుంచి దోచుకొని.. దేశాన్ని మోసం చేసే వారు ఎంత బలవంతులైనా వదిలిపెట్టేది లేదు..
అవినీతిపై తమ ప్రభుత్వం పోరాటం చేస్తోందని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. సిబిఐ, సీవీసీ సంయుక్త సమావేశంలో ఆయన ప్రసంగించారు. గత 6-7 సంవత్సరాలుగా తీసుకున్న చర్యల ఫలితంగా..
అవినీతిపై తమ ప్రభుత్వం పోరాటం చేస్తోందని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. సిబిఐ, సీవీసీ సంయుక్త సమావేశంలో ఆయన ప్రసంగించారు. గత 6-7 సంవత్సరాలుగా తీసుకున్న చర్యల ఫలితంగా.. దేశంలో అవినీతికి తావులేదని నిరూపించినట్లుగా ఆయన వెల్లడించారు. అవినీతిపరులు తప్పించుకోలేరని ఇప్పుడు దేశం నమ్ముతోందని అభిప్రాయపడ్డారు. కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ), కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సంయుక్త సమావేశానికి గుజరాత్ నుంచి వర్చువల్గా హాజరైన మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు మనం భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అమృత్ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాము అని ప్రధాని గుర్తు చేశారు.
రాబోయే 25 సంవత్సరాలలో అంటే ఈ అమృత కాలంలో స్వయం-ఆధారిత భారతదేశం భారీ తీర్మానాల నెరవేర్చుకునే వైపుగా దేశం ముందుకు కదులుతోందన్నారు. నేడు దేశాన్ని మోసం చేసేవారు. చిన్నదైనా, పెద్దదైనా అవినీతి అంటే మరొకరి హక్కుల్ని హరించడమే.. ఇది సమాజంలోని ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపిస్తుందని అన్నారు. జాతి పురోగతికి ఇలాంటివి ఆటంకంగా మారుతాయన్నారు. ప్రజల నుంచి దోచుకొని, దేశాన్ని మోసం చేసే వారు ఎంత బలవంతులైనా.. తాము కనికరం చూపించబోమని దేశం నమ్ముతోందన్నారు. ప్రభుత్వం ఇలాంటివారిని అసలు విడిచిపెట్టదన్నారు.
రాబోయే 25 సంవత్సరాలలో, అంటే, ఈ అమృత కాలంలో, స్వయం-ఆధారిత భారతదేశం యొక్క భారీ తీర్మానాల నెరవేర్పు వైపు దేశం కదులుతోంది. ఈ రోజు మనం సుపరిపాలన సాధికారితలో నిమగ్నమై ఉన్నాము – ప్రో పీపుల్, ప్రోయాక్టివ్ గవర్నెన్స్.
గత ప్రభుత్వాలకు రాజకీయ, పరిపాలనా సామర్థ్యం రెండూ లేవని.. ఇప్పుడు.. అవినీతిని పారదోలే పటిష్ఠ వ్యవస్థ, రాజకీయ సంకల్పం తమకున్నాయని అన్నారు ప్రధాని మోడీ. మధ్యవర్తులు లేకుండానే.. ప్రభుత్వ ప్రయోజనాలు పొందగలమని ఇప్పుడు ప్రజల్లో విశ్వాసం ఏర్పడిందన్నారు. ప్రజలు.. పారదర్శకమైన వ్యవస్థ, సమర్థవంతమైన పాలన కోరుకుంటున్నారని మోడీ తెలిపారు.
ఇవి కూడా చదవండి: LPG Gas Booking – WhatsApp: వాట్సాప్‌తో ఓ మెసెజ్ చేస్తే చాలు మీ LPG గ్యాస్ సిలిండర్ బుక్ అవుతుంది.. ఎలా చేయాలో తెలుసా..