
ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో విపక్ష కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. గత రెండు మూడు రోజులుగా అవిశ్వాస తీర్మానంపై వాడివేడిగా చర్చలు జరుగుతున్నాయి. ఈరోజు కూడా దీనిపై సభలో చర్చ సాగుతోంది. ముందుగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు సభ్యలు దీనిపై మాట్లాడారు. ఆ తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం మాట్లాడారు. అయితే తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ తీర్మానంపై స్పందించారు. లోక్‌సభలో ఇది 28వ అవిశ్వాస తీర్మానం అని అన్నారు. విపక్షాలు చేసినటువంటి అవిశ్వాస తీర్మానం మనకు మంచిదికాదన్నారు. అయితే 2024లో అన్ని రికార్డులు బద్దలు కొడుతూ ఎన్డీయే, బీజేపీ మళ్లీ అధికారంలోకి రావాలని విపక్షాలు నిర్ణయించాయని అన్నారు. మా ప్రభుత్వంపై విశ్వాసముంచిన కోట్లాది మంది ప్రజలకు నా ధన్యవాదాలు. అవిశ్వాసం పెట్టమని దేవుడు ప్రతిపక్షానికి చెప్పి ఉంటారని మోడీ అన్నారు. 2018లోనూ నాపై అవిశ్వాసం ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఇది విపక్షాలకే పరీక్ష అని.. మాకు కాదని అన్నారు. అధికార దాహంతోనే విపక్ష పార్టీలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.