AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mamata: ప్రధాని మోదీకి నేనంటే అసూయ.. అందుకే ఆహ్వానం వచ్చినా ఇటలీ పర్యటన అడ్డుకుంటున్నారు: మమత

ప్రధాని నరేంద్ర మోదీపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. "ప్రధాని నన్ను చూసి అసూయ పడుతున్నారు.

Mamata: ప్రధాని మోదీకి నేనంటే అసూయ.. అందుకే ఆహ్వానం వచ్చినా ఇటలీ పర్యటన అడ్డుకుంటున్నారు: మమత
Mamata
Venkata Narayana
|

Updated on: Sep 26, 2021 | 8:51 AM

Share

Mamata Banerjee: ప్రధాని నరేంద్ర మోదీపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. “ప్రధాని నన్ను చూసి అసూయ పడుతున్నారు.. ఇటలీ నుంచి నాకు ఆహ్వానం వచ్చింది.. కానీ కేంద్రం నా ఇటలీ పర్యటనను అడ్డుకుంటుంది” అని మమతా బెనర్జీ అన్నారు. రోమ్‌లోని వాటికన్‌లో జరిగే ప్రపంచ శాంతి సమావేశానికి హాజరయ్యేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) అనుమతి నిరాకరించడంపై మంత్రి మమతా బెనర్జీ శనివారం తీవ్రంగా స్పందించారు.

ఇటాలియన్ ప్రభుత్వం తనకు ఆహ్వానాన్ని అందజేస్తూ.. అసెంబ్లీ ఎన్నికల విజయం.. సామాజిక న్యాయం కోసం పోరాటం, స్వంత దేశం అభివృద్ధి కోసం తాను పడుతోన్న శ్రమను ప్రస్తావించిందని మమత ఈ సందర్భంగా గుర్తు చేశారు. “చాలా మంది ముఖ్యమంత్రులు అలాంటి ఆహ్వానాల విషయంలో కేంద్రం అనుమతి తీసుకోలేదు, కానీ నేను ఎల్లప్పుడూ మన దేశ విదేశాంగ విధానాలకు అనుగుణంగానే వ్యవహరించాను. అందుకే, నేను అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాను కానీ వారు నిరాకరించారు.” అని మమత ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాదు, ఇటలీలో నిర్వహించే ఆ కార్యక్రమంలో నేను మాత్రమే భారతీయ ప్రతినిధిని. ఒక ముస్లిం బోధకుడు, ఒక క్రైస్తవ మత నాయకుడు కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. అయితే, నేను మాత్రమే హిందూ సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తాను అని మమత చెప్పారు. “నేను విశ్వసించే ఏకైక ఇజం మానవతావాదం. నేను ప్రయాణించడానికి అనుమతించబడితే, భారతీయులు, సమాజాలలో, శాంతి, సామరస్యంతో ఎలా సహజీవనం చేస్తారనే దాని గురించి నేను మాట్లాడుతాను.” అని ఆమె చెప్పారు.

“నేను (మహాత్మా) గాంధీ, (జవహర్‌లాల్) నెహ్రూ, నేతాజీ (సుభాష్ చంద్రబోస్), (వల్లభాయ్) పటేల్ ఇంకా ఇతర నాయకుల గురించి మాట్లాడుతాను. కానీ వారు అలా చేయడానికి నాకు అనుమతి ఇవ్వలేదు. వారు నన్ను ఆపాలనుకుంటున్నారు. వారు నన్ను ఎంతకాలం ఆపుతారో నేను వారిని అడగాలనుకుంటున్నాను? ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా మీరు నన్ను ఆపలేరు. మీరు నన్ను శాశ్వతంగా ఆపలేరు.” అంటూ దీదీ.. మోదీ సర్కారుపై నిప్పులు చెరిగారు.

Read also: Telangana Rains: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు..