AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ పి ‘ అక్షరమే మాకు ‘ ప్రాణం ‘.. చిదంబరం కేసులో ఈడీ

ఐ ఎన్ ఎక్స్ మీడియా కేసులో మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరానికి, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి మధ్య సుప్రీంకోర్టులో ‘ నువ్వా-నేనా ‘ అన్న రీతిలో వాద, ప్రతివాదనలు జరుగుతున్నాయి. రెండు పక్షాల న్యాయవాదులూ తమ వాదనలకు పదును పెడుతూ.. తీవ్ర పదజాలంతో ఈ కేసును పీక్ స్థాయికి తీసుకువెళ్తున్నారు. చిదంబరం తరఫున మంగళవారం వాదించిన సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి .. ఈడీ అధికారుల విచారణ సందర్భంగా తన క్లయింటు […]

' పి ' అక్షరమే మాకు ' ప్రాణం '.. చిదంబరం కేసులో ఈడీ
Pardhasaradhi Peri
|

Updated on: Aug 28, 2019 | 5:00 PM

Share

ఐ ఎన్ ఎక్స్ మీడియా కేసులో మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరానికి, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి మధ్య సుప్రీంకోర్టులో ‘ నువ్వా-నేనా ‘ అన్న రీతిలో వాద, ప్రతివాదనలు జరుగుతున్నాయి. రెండు పక్షాల న్యాయవాదులూ తమ వాదనలకు పదును పెడుతూ.. తీవ్ర పదజాలంతో ఈ కేసును పీక్ స్థాయికి తీసుకువెళ్తున్నారు. చిదంబరం తరఫున మంగళవారం వాదించిన సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి .. ఈడీ అధికారుల విచారణ సందర్భంగా తన క్లయింటు వారికి ఎంతో సహకరిస్తున్నారని, వారు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇస్తున్నారని చెప్పారు. ఏ ప్రశ్నకూ సమాధానం ఇవ్వకుండా తప్పించుకోలేదన్నారు. ‘ మీరు (ఈడీ) నన్ను అరెస్టు చేయాలనుకుంటున్నారు. అయితే ఇందుకు కారణమేమిటి ? నన్ను వేధించేందుకే… వేధించేందుకే.. వేధించేందుకే..(హ్యూమిలేట్ మీ.. హ్యూమిలేట్ మీ.. హ్యూమిలేట్ మీ..) అంటూ ఇంగ్ల్లీష్ లో ‘ హెచ్ ‘ అన్న అక్షరాన్ని మరీ బోల్డ్ గా పెద్ద అక్షరాల్లో పెట్టారు.. నిముష..నిముషానికీ.. గంటగంటకూ.. ‘ ఇలా చిద్దూ పిటిషన్ ని ఉటంకిస్తూ సింఘ్వి వాదించారు. చిదంబరాన్ని అరెస్టు చేయకుండా తాత్కాలిక రక్షణను కోర్టు పొడిగించిన నేపథ్యంలో.. బుధవారం జరిగిన వాదనల్లో ఈడీ తరఫు లాయర్.. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. దీనికి కౌంటరిచ్చారు. ఈడీ ఈయననేమీ వేధింపులకు గురి చేయలేదని, పైగా ‘ నివారణ, నివారణ ‘ (ప్రివెన్షన్.. ప్రివెన్షన్) అన్న ధోరణినే తాము పాటించామని ఆయన చెప్పారు. అరెస్టు కాకుండా చిదంబరం ప్రొటెక్షన్ ను వ్యతిరేకించిన ఆయన..ఈడీ విధులకు ఈ కోర్టు అడ్డుపడుతోందని పేర్కొన్నారు. నిందితుడి మనీ లాండరింగ్ కేసు పథకం ప్రకారం జరిగిన నేరమని, అందువల్ల చిదంబరం కస్టోడియల్ ఇంటరాగేషన్ ఎంతయినా అవసరమని మెహతా అన్నారు. ప్రపంచంలోని వివిధ బ్యాంకుల నుంచి తాము వివరాలు సేకరించామని, అయితే వాటిని బహిర్గతం చేయరాదు గనుక సీల్డ్ కవర్లో పెట్టి సమర్పిస్తున్నామని అన్నారు. పైగా నిబంధనల ప్రకారం ఇలా చేయాల్సిందే నన్నారు. ఈ కారణంగానే ఇది అత్యంత సెన్సిటివ్ కేసు అయిందని వ్యాఖ్యానించారు.