Presidential Election 2022: రాష్ట్రపతి ఎన్నికకు విడుదల కానున్న నోటిఫికేషన్.. నేటి నుంచే నామినేషన్లు సైతం..!

|

Jun 15, 2022 | 6:00 AM

Presidential Election 2022: రాష్ట్రపతి ఎన్నికకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. నోటిఫికేషన్‌ ప్రారంభం రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ సైతం ప్రారంభం కానుంది.

Presidential Election 2022: రాష్ట్రపతి ఎన్నికకు విడుదల కానున్న నోటిఫికేషన్.. నేటి నుంచే నామినేషన్లు సైతం..!
Eci
Follow us on

Presidential Election 2022: రాష్ట్రపతి ఎన్నికకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. నోటిఫికేషన్‌ ప్రారంభం రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ సైతం ప్రారంభం కానుంది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 29 చివరి తేదీ కాగా.. జూలై 18న ఓటింగ్‌, జూలై 21న ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నిక ప్రక్రియ మొత్తం జూలై 24నాటికి పూర్తికానుంది.

ఇదిలాఉంటే.. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. బీజేపీకి పోటీగా ప్రతిపక్షాల తరఫున దీటైన ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలో ఇవాళ ఢిల్లీలో కీలకభేటీ జరుగనుంది. ఈ సమావేశంలో ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఈ సమావేశానికి ప్రముఖ పార్టీలకు చెందిన ప్రతినిధులందరూ హాజరవుతున్నట్లు తెలుస్తోంది. మరి విపక్షాలు ఏకతాటిపైకి వస్తాయా? ఉమ్మడి అభ్యర్థిని నిలిపి ఎన్నికల్లో వారిని గెలిపించే ప్రయత్నం చేస్తాయా? అనేది వేచి చూడాలి.