45 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు నేషనల్‌ టీచర్‌ అవార్డులు 2025 ప్రదానం.. APలో ఆయనే బెస్ట్‌ టీచర్‌!

National Awards to 45 teachers on occasion of Teachers Day 2025: ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 45 మందికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం (సెప్టెంబర్‌ 5) జాతీయ ఉపాధ్యాయ అవార్డు (నేషనల్ టీచర్‌ అవార్డు 2025)లను ప్రదానం చేశారు..

45 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు నేషనల్‌ టీచర్‌ అవార్డులు 2025 ప్రదానం.. APలో ఆయనే బెస్ట్‌ టీచర్‌!
President Droupadi Murmu Honours Teachers

Updated on: Sep 05, 2025 | 3:34 PM

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 5: విద్యార్ధులను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో అకుంటిత దీక్షను కనబరచిన ఉత్తమ ఉపాధ్యాయులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం (సెప్టెంబర్‌ 5) అవార్డులు అందించారు. దేశవ్యాప్తంగా మొత్తం 45 మంది ఉపాధ్యాయులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ ఉపాధ్యాయ అవార్డు (నేషనల్ టీచర్‌ అవార్డు 2025)లను ప్రదానం చేశారు. వినూత్న బోధనా పద్ధతులు, విద్యార్థుల వృద్ధికి అంకితభావం, క్లిష్ట పరిస్థితుల్లోనూ అభ్యాస విజయాలను పెంపొందడం, స్ఫూర్తిదాయకమైన బోధన వంటి విషయాల్లో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి ఈ వార్షిక అవార్డు ప్రదానోత్సవంలో గుర్తింపు దక్కింది. అవార్డు గ్రహీతలలో ఆంధ్రప్రదేశ్‌లోని మైలవరంకి చెందిన డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో తెలుగు అధ్యాపకుడిగా ఉన్న ఎం. దేవానంద కుమార్ కూడా ఉన్నారు. వినూత్న బోధనా పద్ధతులకు గాను ఆయన అవార్డు అందుకున్నారు .

తాళ్లపత్ర గ్రంథాలను సృష్టించడం, LMS కోసం విద్యా వీడియోలను రూపొందించడం, విద్యకు ఆయన చేసిన కృషికిగానూ ఈ అవార్డు దక్కింది. ఇక అరుణాచల్ ప్రదేశ్‌లోని రాజీవ్ గాంధీ సెంట్రల్ యూనివర్సిటీలో సైకాలజీ ఫ్యాకల్టీ అయిన ప్రోశాంతో క్ర సాహా..14 ఏళ్లకుపైగా ఫోరెన్సిక్ సైకాలజీ, న్యూరోసైకాలజీలో ఆయన నైపుణ్యాలకుగాను అవార్డు అందుకున్నారు. న్యూరోసైకాలజీ ల్యాబ్‌ను స్థాపించడంతోపాటు జోక్య శిక్షణా మాడ్యూళ్లను అభివృద్ధి చేశారు. ప్రధాన పరిశోధన ప్రాజెక్టులకు నాయకత్వం వహించడం, పిల్లలపై వేధింపుల బాధితులకు మానసిక మద్దతును అందించారు. ఇది విద్యా నైపుణ్యం, సామాజిక ప్రభావం రెండింటిపై ఆయన నిబద్ధతను ప్రతిబింబిస్తుందని.. ఆయన అందుకున్న ప్రశంసా పత్రం పేర్కొంది.

ఇవి కూడా చదవండి

ఈ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ అవార్డు గ్రహీతలతో సంభాషించారు. ఉపాధ్యాయులు సాధారణంగా విద్యార్థులకు హోంవర్క్ ఇస్తారు. కానీ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే ప్రచారాలకు నాయకత్వం వహించడానికి, ‘మేక్ ఇన్ ఇండియా’, ‘వోకల్ ఫర్ లోకల్’ ఉద్యమాలను బలోపేతం చేయడానికి వారికి ఒక హోంవర్క్ కేటాయించాలని తాను కోరుకుంటున్నట్లు ప్రధాని మోదీ తన ప్రసంగంలో తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.