Greetings to CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు (CM KCR) గురువారంతో (ఫిబ్రవరి 17) 68వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (Ram Nath Kovind) ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR Birthday)కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఫోన్ చేసి శుభాంక్షలు తెలిపారు. రాష్ట్రపతితోపాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. స్వయంగా ఫోన్ చేయడంతోపాటు ట్వీట్టర్ వేదికగా ప్రధాని మోదీ.. కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం కేసీఆర్ చిరకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. వారితోపాటు.. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కేసీఆర్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వారితోపాటు పలువురు జాతీయ నాయకులు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా ఢిల్లీ తెలంగాణ భవన్ దగ్గర ఫ్లెక్సీలు ఏర్పాటు చేసారు. కేసీఆర్ విజన్ ఆఫ్ ఇండియా పేరుతో ఫ్యాన్స్ ఫ్లెక్సీలు పెట్టారు.
అయితే.. తెలంగాణ విభజన తీరును మోదీ విమర్శించడం దానిపై కేసీఆర్ నిప్పులు చెరుగుతూ ప్రెస్‌మీట్ పెట్టడం మనమంతా చూశాం. ఇటు అసోం సీఎం కూడా రాహుల్ గాంధీని విమర్శించడం, విమర్శించిన తీరును కేసీఆర్ తప్పుబట్టడం ఆ తర్వాత పరస్పరం వ్యతిరేకించుకుంటూ ట్వీట్లు పెట్టుకోవడం చూశాం. కానీ.. ఇప్పుడు ఆ ట్వీట్లు కాస్త తగ్గి.. శుభాకాంక్షల ట్వీట్లు మొదలయ్యాయి. కేసీఆర్‌కు మోదీ ఫోన్ చెయ్యడం, అసోం సీఎం కూడా ట్వీట్ చెయ్యడం ఇప్పుడు కాస్త ఆసక్తి కల్గిస్తున్నాయి.
జాతీయ నేతలతోపాటు తెలుగు రాష్ట్రాల నాయకులు సైతం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేసీఆర్‌కు బర్త్‌డే విషెస్ తెలిపారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ( KCR ) హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సదా ఆనంద ఆరోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.. అంటూ ట్విట్ చేశారు. వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతోపాటు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
కేసీఆర్ సీఎం అయ్యాకే తెలంగాణ తలరాత మారింది, ఆయన నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకెళ్తోందన్న మంత్రి హరీష్ రావు సీఎం కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ జన్మదినం తెలంగాణకు పండుగరోజన్న హరీష్.. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్థిల్లాలంటూ ట్వీట్ చేశారు.
హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో మృత్యుంజయ హోమం నిర్వహించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. టెంపుల్‌లో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్సీ కవిత అమ్మవారికి బంగారు ఆభరణాలు సమర్పించారు.
కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మధ్యాహ్నం కాలినడకన తిరుమల చేరుకుంటారు. రేపు ఉదయం శ్రీవారిని కవిత దర్శించుకోనున్నారు.
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పంచముఖి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.
Also Read: