CM KCR Birthday: సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
PM Narendra Modi Greetings to CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు (CM KCR) ఈ రోజుతో (ఫిబ్రవరి 17) 68వ వసంతంలోకి అడుగుపెట్టారు. తెలంగాణ రాష్ట్రం కోసం

PM Narendra Modi Greetings to CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు (CM KCR) ఈ రోజుతో (ఫిబ్రవరి 17) 68వ వసంతంలోకి అడుగుపెట్టారు. తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిషలు పోరాటం చేసిన సీఎం కేసీఆర్‌కు ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా గ్రామగ్రామన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) స్వయంగా ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ప్రధాని మోదీ.. ట్వీట్టర్ వేదికగా కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. 68వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సీఎం కేసీఆర్ చిరకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రధాని మోదీ ట్వీట్‌లో రాశారు. తెలంగాణ బీజేపీ చీఫ్ ఎంపీ బండి సంజయ్ కూడా సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. నిండూ నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలంటూ ఆకాంక్షించారు.
Birthday wishes to Telangana CM Shri KCR Garu. Praying for his long and healthy life. @TelanganaCMO
— Narendra Modi (@narendramodi) February 17, 2022
ఇదిలాఉంటే.. సీఎం కేసీఆర్ తనయుడు.. మంత్రి కేటీఆర్ (KTR), కూతురు ఎమ్మెల్సీ కవిత, మంత్రి హరీష్ రావు, సైతం ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం కేసీఆర్ (CM KCR Birthday) జన్మదినాన్ని ఈ సారి నిర్వహిస్తున్నారు. ఈనెల 15 నుంచి ఈరోజు వరకు జన్మదిన వేడుకలను నిర్వహించాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
To a man, who can only dream Big, who has made impossible an art of the possible, One who leads with a heart full of compassion, One who defines courage & challenges status quo
A man who I proudly call my leader & my father. May you live long & stay blessed?#HappyBirthdayKCR pic.twitter.com/H5qHGit0Ra
— KTR (@KTRTRS) February 17, 2022
కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన కేసీఆర్ కప్ ఫినాలేలో ఎమ్మెల్సీ కవిత పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
CM Sri KCR gari Birthday celebrations at KCR Cup finale in LB Stadium, Hyderabad#HappyBirthdayKCR pic.twitter.com/DMnhKkn0XL
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 16, 2022
సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వమత ప్రార్థనలు, సేవా కార్యక్రమాలు, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కాగా.. ఇటీవల జాతీయ రాజకీయాల వైపు దృష్టి సారించిన ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్‌డే వేడుకలను ఈసారి ఘనంగా నిర్వహిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వ విధానాలపై యుద్దం ప్రకటించి దూకుడు పెంచిన కేసీఆర్ ఇప్పటికే పవర్ సెంటర్‌గా మారారు. ఈ క్రమంలో బీజేపీయేతర పార్టీలు నిర్వహించే భేటీకి సైతం సీఎం కేసీఆర్ సమాయత్తమవుతున్నారు. ఈ క్రమంలో 20వ తేదీన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో ముంబైలో భేటీ కానున్నారు.
Also Read:
