IIT JAM 2022 Results: JAM 2022 రెస్పాన్స్ షీట్లు, క్వశ్చన్ పేపర్లు విడుదల.. డౌన్లోడ్ ఇలా..
ఎమ్మెస్సీలో ప్రవేశాలకు జాయింట్ అడ్మిషన్ టెస్ట్ (JAM 2022)కు సంబంధించిన రెస్పాన్స్ షీట్లను, ప్రశ్న పత్రాలను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ (IIT Roorkee) బుధవారం (ఫిబ్రవరి 16) విడుదల చేసింది..
IIT JAM 2022 response sheets Released: ఎమ్మెస్సీలో ప్రవేశాలకు జాయింట్ అడ్మిషన్ టెస్ట్ (JAM 2022)కు సంబంధించిన రెస్పాన్స్ షీట్లను, ప్రశ్న పత్రాలను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ (IIT Roorkee) బుధవారం (ఫిబ్రవరి 16) విడుదల చేసింది. బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్, జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ – మొత్తం ఏడు సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్న పత్రాలు అధికారిక వెబ్సైట్ jam.iitr.ac.inలో విడుదలయ్యాయి. ఈ ఏడు పేపర్లకు సంబంధించిన జామ్ ఆన్సర్ కీపై అభ్యంతరాలను లేవనెత్తడానికి ఐఐటీ అభ్యర్థులకు అనుమతినిస్తూ ఐఐటీ రూర్కీ ప్రకటన వెలువడించింది. JAM JOAPS నుంచి అభ్యంతరాల (objections)ను తెల్పవచ్చు. ఐతే ప్రతి అభ్యంతరానికి రుసుము చెల్లించవల్సి ఉంటుంది. అబ్జెక్షన్స్తోపాటు సపోర్ట్ డాక్యుమెంట్‌ను కూడా తప్పనిసరిగా సబ్మిట్ చెయ్యవల్సి ఉంటుంది. జామ్ ఆన్సర్ కీపై వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతుంది. వీటిల్లో చెల్లుబాటు అయ్యే అభ్యంతరాల ఆధారంగా, జవాబు కీని తయారుచేస్తారు. పునరుద్ధరణల అనంతరం తుది ఆన్సర్ కీ విడుదల అవుతుంది. దీని ఆధారంగానే ఫైనల్ రిజల్ట్స్ విడుదలవుతాయి.
IIT JAM 2022 రెస్పాన్స్ షీట్లు ఎలా డౌన్లోడ్ చేయాలంటే..
- ముందుగా అధికారిక వెబ్సైట్ jam.iitr.ac.inను ఓపెన్ చెయ్యాలి.
- హోమ్‌పేజ్‌లో రెస్పాన్స్ షీట్ లింక్ కనిపిస్తుంది. లింక్‌పై క్లిక్ చెయ్యాలి.
- న్యూ విండో ఓపెన్ అవుతుంది. అభ్యర్ధుల ఎన్రోల్మెంట్ ఐడీ/ఇమెయిల్ ఐడీతోపాటు పాస్‌వర్డ్‌ను నమోదు చెయ్యాలి. తర్వాత క్యాప్చాను కూడా నమోదు చేసి సబ్మిట్పై క్లిక్ చెయ్యాలి.
- అభ్యర్ధులకు సంబంధించిన రెస్పాన్స్ షీట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- డౌన్లోడ్ చేసుకుని, ప్రింట్ఔట్ తీసుకోవాలి.
IIT JAM 2022 క్వశ్చన్ పేపర్ ఎలా డౌన్లోడ్ చేయాలంటే..
- ముందుగా అధికారిక వెబ్సైట్ jam.iitr.ac.inను ఓపెన్ చెయ్యాలి.
- హోమ్‌పేజీలో ‘JAM 2022 క్వశ్చన్ పేపర్స్’ అనే లింక్‌పై క్లిక్ చెయ్యాలి.
- సబ్జెక్టుల వారీగా లింక్‌లు ఉన్న న్యూ విండో ఓపెన్ అవుతుంది.
- సంబంధిత సబ్జెక్ట్ క్వశ్చన్ పేపర్‌పై క్లిక్ చేసి, డౌన్లోడ్ చేసుకోవాలి.
Also Read: