బీహార్, సెప్టెంబర్ 16: త్వరలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు పార్టీలకు చెందిన నేతలు ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా ప్రచార సభలు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఒక్క గంటలోనే సంపూర్ణ మద్యపానం అమల్లోకి తెస్తానని హామీ ఇచ్చారు. ఆయన ఇటీవల జన్ సూరజ్ పార్టీ ఏర్పాటు చేసి, రాష్ట్రంలో తదుపరి జరిగే ఎన్నికలకు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబరు 2న తమ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కోసం ప్రత్యేక ప్రణాళికల గురించి ప్రశ్నించగా.. అందుకు ప్రత్యేక సన్నాహాలు అవసరం లేదన్నారు. గత రెండేళ్లుగా మేం సిద్ధమవుతున్నాం.. జన్ సూరజ్ ప్రభుత్వం ఏర్పడితే ఒక్క గంటలోగా మద్య నిషేధానికి ముగింపు పలుకుతామన్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో అమలవుతున్న మద్యనిషేధ విధానాన్ని నకిలీగా అభివర్ణించారు.
‘మద్య నిషేధం వల్ల ప్రతీ యేట రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రూ.20,000 కోట్ల నష్టాన్ని చవిచూస్తోంది. అయితే మద్యం మాఫియా, అధికారులు మాత్రం అక్రమ వ్యాపారాల ద్వారా అడ్డగోలుగా డబ్బు సంపాదిస్తున్నారని ఆయన అన్నారు. ఈ విధానానికి తాను వ్యతిరేకినన్నారు. మహిళల ఓటు బ్యాంకును కోల్పోతామన్న భయం లేదని’ ప్రశాంత్ కిషోర్ అన్నారు. ‘నాకు మహిళల ఓట్లు వచ్చినా, రాకపోయినా, మద్య నిషేధానికి వ్యతిరేకంగా మాట్లాడటం కొనసాగిస్తాను. ఎందుకంటే ఇది బీహార్‌కు ఎలాంటి ప్రయోజనం కలిగించదు’ అని ఆయన అన్నారు.
బీహార్‌లో 2016 నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్‌పై నిప్పులు చెరిగారు. నితీష్ సర్కార్ అమలు చేస్తున్న మద్యపాన నిషేధంపై కిషోర్ విమర్శలు గుప్పించారు. మరణానికి, అజ్ఞానాంధకారానికి దారి తీసే మద్యాన్ని నియంత్రించడంలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. తేజస్వి యాదవ్, నితీష్ కుమార్ ఇద్దరూ బీహార్ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని ప్రశాంత్ కిషోర్ విమర్శించారు. ఇద్దరు నేతల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సమస్యంతా నితీష్ కుమార్, తేజస్వి యాదవ్ మధ్య ఉందని, ఎవరు ఎవరికి క్షమాపణలు చెప్పారనేది ముఖ్యం కాదు. ఇద్దరూ బీహార్‌కు నష్టం కలిగిస్తున్నారు. బీహార్ ప్రజలు 30 ఏళ్లుగా వారిద్దరినీ చూస్తున్నారు. వారిద్దరూ బీహార్ విడిచి వెళ్లాలని మేమంతా కోరుతున్నామన్నారు.