Bhagavad Gita: పాఠశాలల్లో భగవద్గీత బోధించే ఆలోచన.. సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి

|

Mar 21, 2022 | 7:14 AM

మొన్న గుజరాత్‌, నిన్న కర్ణాటక. భగవద్గీత బోధనపై కీలక ఆదేశాలు జారీ చేశాయి. తాజాగా ఈ ఇష్యూపై ఆసక్తికర కామెంట్స్‌ చేశారు కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి.

Bhagavad Gita: పాఠశాలల్లో భగవద్గీత బోధించే ఆలోచన.. సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి
Pralhad Joshi
Follow us on

Bhagavad Gita in Schools: మొన్న గుజరాత్‌(Gujarat), నిన్న కర్ణాటక(Karnataka). భగవద్గీత బోధనపై కీలక ఆదేశాలు జారీ చేశాయి. తాజాగా ఈ ఇష్యూపై ఆసక్తికర కామెంట్స్‌ చేశారు కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి(Pralhad Joshi). గుజరాత్‌ తరహాలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలల్లో భగవద్గీత బోధించే ఆలోచన చేయాలని కేంద్ర మంత్రి ప్రల్హాద్ జోషి సూచించారు. భగవద్గీత మనకు నైతికతను బోధిస్తుందని, సమాజ శ్రేయస్సు పట్ల మన బాధ్యతను తెలియజేస్తుందని వివరించారు జోషి. విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే అనేక కథలు ఇందులో ఉన్నాయని, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలని కోరారు కేంద్రమంత్రి. గుజరాత్‌లోని అన్ని పాఠశాలల్లో ఈ ఏడాది నుంచే 6 నుంచి 12వ తరగతి వరకు భగవద్గీత బోధించనున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జితు వాఘాని ప్రకటించారు.

తాజాగా కర్ణాటక కూడా ఇదే నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. అయితే అంతకంటే ముందు విద్యానిపుణులతో చర్చించి దీనిపై అధికారిక ప్రకటన చేస్తామని వెల్లడించారు కర్ణాటక విద్యాశాఖ మంత్రి బిసి నగేశ్‌. ఇటీవల కాలంలో పిల్లల్లో సాంస్కృతిక విలువలు పడిపోతున్న నేపథ్యంలో, చాలా మంది మోరల్‌ సైన్స్‌ను పాఠశాలల్లో బోధించాలని కోరుతున్నారని చెప్పారు కర్ణాటక మంత్రి. గతంలో పాఠశాలల్లో వారానికోసారి మోరల్‌ సైన్స్‌ తరగతి ఉండేదని, అందులో రామాయణం, మహాభారతం వంటి వాటిని నేర్పించేవారని వివరించారు. రాజనీతజ్ఞులు కూడా వీటి నుంచి ప్రేరణ పొందినవారేనని, కానీ ఇప్పుడు పరిస్థితులు మారి అవన్నీ చెప్పడం మానేశారని కామెంట్‌ చేశారు మగేశ్. గుజరాత్‌ ప్రభుత్వం స్కూళ్లలో భగవద్గీతను బోధించాలని నిర్ణయించిందని, ఈ విషయం తెలిసి తాము కూడా అదే దిశగా ఆలోచిస్తున్నామన్నారు బీసీ నగేశ్. దీనిపై రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి సూచనలు తీసుకుంటామని, విద్యానిపుణులతో చర్చించిన అనంతరం మోరల్‌ సైన్స్‌ క్లాసులను తీసుకొస్తామని బీసీ నగేశ్ స్పష్టం చేశారు.

Read Also… 

Corona Waves: దేశంలో కరోనా కొత్త వేవ్ విజృంభణ.. ప్రజల ఆరోగ్య పరిస్థితిపై నిపుణులు ఏమన్నారంటే