AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pralhad Joshi: కాంగ్రెస్‌ది బుజ్జగింపు రాజకీయం.. కర్ణాటక ప్రభుత్వంపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఫైర్..

మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని బీజేపీ స్పష్టం చేసింది. ఓటు బ్యాంక్‌ రాజకీయాల్లో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని బీజేపీ మండిపడుతోంది.. ఈ విషయంపై తాజాగా.. ఈ విషయంపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. కర్ణాటక అసెంబ్లీ వక్ఫ్ (సవరణ) బిల్లును వ్యతిరేకించడం, 4% రిజర్వేషన్ల వివాదాన్ని తిరస్కరించడంపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆగ్రహం వ్యక్తంచేశారు.

Pralhad Joshi: కాంగ్రెస్‌ది బుజ్జగింపు రాజకీయం.. కర్ణాటక ప్రభుత్వంపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఫైర్..
Pralhad Joshi
Shaik Madar Saheb
|

Updated on: Mar 20, 2025 | 1:03 PM

Share

కర్ణాటక రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో వక్ఫ్ (సవరణ) బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించింది. తీర్మానాన్ని లా అండ్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి హెచ్‌కె పాటిల్ ప్రతిపాదించారు. రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించే నిబంధనలను కలిగి ఉన్న వక్ఫ్ (సవరణ) బిల్లు, 2024ను వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం.. తీర్మానం చేసింది.. కాగా.. అంతకుముందు ప్రభుత్వ కాంట్రాక్ట్‌ల్లో మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సిద్దరామయ్య సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. వక్ఫ్ బిల్లును వ్యతిరేకించడం.. అలాగే మైనారిటీలకు రిజర్వేషన్ల అంశంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తంచేసింది. మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని బీజేపీ స్పష్టం చేసింది. ఓటు బ్యాంక్‌ రాజకీయాల్లో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని బీజేపీ మండిపడుతోంది.. ఈ విషయంపై తాజాగా.. ఈ విషయంపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. కర్ణాటక అసెంబ్లీ వక్ఫ్ (సవరణ) బిల్లు, 4% రిజర్వేషన్ల వివాదాన్ని తిరస్కరించడంపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ..ఇది బుజ్జగింపు రాజకీయం అంటూ పేర్కొన్నారు.. సుప్రీంకోర్టు కూడా, ఆర్టికల్ 15 క్లాజ్ 1 కింద, మీరు మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వలేరని చెప్పిందని.. జోషి గుర్తుచేశారు.

కర్ణాటకలోని వక్ఫ్‌ విషయంలో ఏమి జరుగుతోందో ప్రహ్లాద్ జోషి వివరించారు.. వక్ఫ్ బోర్డు పేరుతో భూమిని లాక్కుని, పండించిన పంటలను బుల్డోజర్‌తో నాశనం చేసినందుకు తన నియోజకవర్గానికి ఆనుకొని ఉన్న ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడని… అలాంటి సంఘటనలు చాలా ఉన్నాయంటూ పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ నాయకత్వంలోని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా బుజ్జగింపు రాజకీయాలలో నిమగ్నమై ఉందని విమర్శించారు. కర్ణాటక బుజ్జగింపు రాజకీయాల ప్రయోగశాలగా మారిందని.. అయితే.. ఇలాంటి నిర్ణయాలు పనిచేయవని పేర్కొన్నారు. తాము ఈ అంశాన్ని దేశవ్యాప్తంగా లేవనెత్తుతాము.. అంటూ ప్రహ్లాద్ జోషి స్పష్టంచేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..