రాజకీయంగా అగ్గి రాజేస్తున్న నీట్.. లీకేజీపై నేతల కీలక డిమాండ్..

నీట్‌ పేపర్‌ లీక్ అయిన వ్యవహారంలో నివ్వెరపోయే నిజాలు బయటకొస్తున్నాయి. బిహార్‌లో జరిగిన ఈ లీక్‌ వ్యవహారంలో నిందితులు కన్ఫెషన్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. పేపర్‌ లీక్‌ నిజమేనని పోలీసుల విచారణలో నిందితులు అంగీకరించారు. నీట్‌కు ఒక్క రోజు ముందు ప్రశ్నపత్రంతోపాటు సమాధానాల ‘కీ’ని సైతం అభ్యర్థులకు అందజేసి, వాళ్లను పరీక్షకు సిద్ధం చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నీట్ లీక్స్‌.. నిజమే. ఇక వాట్‌ నెక్ట్స్‌? 2024 నీట్‌ను రద్దు చేస్తారా? మళ్లీ ఎంట్రెన్స్‌ నిర్వహిస్తారా? జరగబోయేది ఏంటో కానీ రాజకీయంగా రచ్చ రాజుకుంటోంది.

రాజకీయంగా అగ్గి రాజేస్తున్న నీట్.. లీకేజీపై నేతల కీలక డిమాండ్..
Neet Exam
Follow us

|

Updated on: Jun 21, 2024 | 10:06 PM

నీట్‌ పేపర్‌ లీక్ అయిన వ్యవహారంలో నివ్వెరపోయే నిజాలు బయటకొస్తున్నాయి. బిహార్‌లో జరిగిన ఈ లీక్‌ వ్యవహారంలో నిందితులు కన్ఫెషన్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. పేపర్‌ లీక్‌ నిజమేనని పోలీసుల విచారణలో నిందితులు అంగీకరించారు. నీట్‌కు ఒక్క రోజు ముందు ప్రశ్నపత్రంతోపాటు సమాధానాల ‘కీ’ని సైతం అభ్యర్థులకు అందజేసి, వాళ్లను పరీక్షకు సిద్ధం చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నీట్ లీక్స్‌.. నిజమే. ఇక వాట్‌ నెక్ట్స్‌? 2024 నీట్‌ను రద్దు చేస్తారా? మళ్లీ ఎంట్రెన్స్‌ నిర్వహిస్తారా? జరగబోయేది ఏంటో కానీ రాజకీయంగా రచ్చ రాజుకుంటోంది. ఓవైపు విద్యార్థి సంఘాలు..మరోవైపు పొలిటికల్‌ పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు అంతకంతకు ఎగుస్తున్నాయి. నీట్‌ పేపర్‌ లీకేజీ నిజమేనని తేలిన క్రమంలో NDA సర్కార్‌ వైఖరి ఏంటీ.. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ NTA వెర్షన్‌ ఏంటన్నది ఆసక్తికరంగా మారిందిప్పుడు. నీట్‌ ఎంట్రెన్స్‌లో అవకతవకలపై సుప్రీంకోర్టు ఇప్పటికే కేంద్రానికి, ఎన్‌టీఏకు నోటీసులు జారీ చేసింది. తప్పులు జరిగి వుంటే ఒప్పుకుని సరిదిద్దాలని ఆదేశించింది. పాయింట్‌ వన్‌ పర్సెంట్‌ నిర్లక్ష్యం ఉన్నా సరే ఎన్‌టీఏ చర్యలు తీసుకోవాలని సూచన చేస్తూ తదుపరి విచారణను జులై 8కి వాయిదా వేసింది సుప్రీం.

ఇర NTA షెడ్యూల్‌ ప్రకారం నీట్‌ కౌన్సెలింగ్‌ జులై మొదటి వారంలోనే ఉంది. బీహార్‌లో నీట్‌ పేపర్‌ లీకైందనే నిజాలు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో నీట్‌ను రద్దు చేసి..మళ్లీ ఎంట్రెన్స్‌ నిర్వహించాలనే డిమాండ్లతో పాటు పిటిషన్లు వెల్లువెత్తాయి. ఐతే కౌన్సెలింగ్‌ ను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తాజాగా నమోదయిన పిటిషన్లపై కూడా జులై 8న విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. నీట్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారంపై సమగ్ర సమాచారం ఇవ్వాలని ఎన్‌టీఏకు నోటీసులు జారీ చేసింది సుప్రీం కోర్టు. నీట్‌ కు సంబంధించి ఇవి లేటెస్ట్‌ అప్‌డేట్స్‌. ఇక 2024 నీట్‌ను రద్దు చేయాల్సిందేనంటూ ఇటు విద్యార్థి సంఘాలు అటు విపక్షాలు ఆందోళనలను ఉధృతం చేస్తున్నాయి.

నీట్‌ పేపర్‌ లీక్ స్కామ్‌లో నివ్వెరపోయే నిజాలు బయటకొస్తున్నాయి. బిహార్‌లో జరిగిన ఈ లీక్‌ వ్యవహారంలో నిందితులు కన్ఫెషన్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. పేపర్‌ లీక్‌ నిజమేనని పోలీసుల విచారణలో నిందితులు అంగీకరించారు. నీట్‌కు ఒక్క రోజు ముందు ప్రశ్నపత్రంతోపాటు సమాధానాల ‘కీ’ని సైతం అభ్యర్థులకు అందజేసి, వాళ్లను పరీక్షకు సిద్ధం చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. క్విడ్‌ ప్రో కోగా కొశ్చన్‌ పేపర్‌ అండ్‌ కీకి 32 లక్షలు వసూలు చేసినట్టు దర్యాప్తులో వెలుగుచూసింది. నీట్‌గా పేపర్‌ లీక్‌ చేయడమే కాకుండా.. సరదు విద్యార్థులకు పాట్నాలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాట్లు కూడా చేశారు. ఈ కేసులో బిహార్‌ పోలీసులు పలువురు నిందితులను అరెస్టు చేశారు. నీట్‌ పరీక్ష పేపర్‌ లీక్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, NTA పనితీరుపై , లోపాలపై ఉన్నతస్థాయి కమిటీ దర్యాప్తు చేస్తుందన్నారు. పేపర్‌ లీక్‌ వ్యవహారంపై బిహార్‌ ప్రభుత్వంతో టచ్‌లో ఉన్నట్ట తెలిపారు. దోషులను వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. ఈవిషయంలో విపక్షాలు రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు.

నీట్‌ రద్దు చేయాలని డిమాండ్లు తీవ్రమవుతున్న వేళ బిహార్‌ డిప్యూటీ సీఎం విజయ్‌ సిన్హా సంచలన ఆరోపణలు చేశారు. నీట్‌ పేపర్‌ లీక్‌ కుంభకోణంలో RJD నేత తేజస్వీ యాదవ్‌ పాత్ర ఉందని అన్నారు. మే ఒకటిన గెస్ట్‌హౌజ్‌లో రూమ్‌ బుక్‌ చేయాలని తేజస్వీ యాదవ్‌ వ్యక్తిగత కార్యదర్శి ప్రీతమ్‌ కుమార్‌ ఫోన్‌ చేసి చెప్పారని అన్నారు. ఆ కాల్‌ డిటెయిల్స్‌ బయటపెట్టారు ఫోన్‌ చేసిన వ్యక్తి ఇంకా తేజస్వీ పీఏగా కొనసాగుతున్నారా స్పష్టం చేయాలని విజయ్‌ సిన్హా డిమాండ్ చేశారు. అయితే ఈ ఆరోపణల్లో నిజం లేదన్నారు తేజస్వి యాదవ్‌ పేపర్‌ లీక్‌ నిజమేనని తేలడంతో నీట్‌పై రాజకీయ రగడ కూడా మరింత ముదిరింది. ప్రధాని మోదీ తీరు తోనే దేశంలో పేపర్‌ లీక్‌లు పెరిగిపోయాయని విమర్శించారు రాహుల్‌గాంధీ.. ఉక్రెయిన్‌ , గాజా యుద్దాన్ని ఆపినట్టు చెబుతున్న మోదీ, పేపర్‌ లీక్‌లను మాత్రం అడ్డుకోలేకపోతున్నారని సెటైర్‌ వేశారాయన. వెంటనే నీట్‌ పరీక్షను రద్దు చేయాలని రాహుల్‌ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు రాహుల్‌ ఇక నీట్ పరీక్షను రద్దు చేయాలని ఢిల్లీలో విద్యార్ధి సంఘాలు భారీ నిరసన చేపట్టాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ నివాసాన్ని ఎన్‌ఎస్‌యూఐతో పాటు లెఫ్ట్‌ విద్యార్ధి సంఘాలు ముట్టడించాయి. పేపర్‌ లీక్‌లను అడ్డుకోవడంలో కేంద్రం ఘోరంగా విఫలమయ్యిందని ఆరోపిస్తూ విద్యార్ధి సంఘాలు ఆందోళన నిర్వహించాయి.

నీట్‌ పేపర్‌ లీక్‌, అవకతవకలకు నిరసనగా తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఆందోళనల బాటపట్టింది. హైదరాబాద్‌లో గాంధీభవన్‌ నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీ నిర్వహించారు. నీట్‌ పరీక్షను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. పేపర్‌ లీక్‌ నిజం అని తేలడంతో 2024 నీట్‌ను రద్దు చేయాలనే డిమాండ్‌ ఊపందుకుంది. మరోవైపు షెడ్యూల్‌ ప్రకారం వచ్చే నెల మొదటి వారంలోనే కౌన్సెలింగ్‌ ఉంది. కౌన్సెలింగ్‌ ప్రక్రియను వాయిదా వేయడానికి సుప్రీం అంగీకరించలేదు. ఈ క్రమంలో ఇటు కేంద్రం అటు ఎన్‌టీఏ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్
యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్
హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 8వ రోజు హైలెట్స్
హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 8వ రోజు హైలెట్స్
ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..
ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..
భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన నాగమణికంఠ
భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన నాగమణికంఠ
ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్..వీడియో
ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్..వీడియో
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరిన ముగ్గురు మృత్యువాత!
పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరిన ముగ్గురు మృత్యువాత!
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
మరోసారి అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు!
మరోసారి అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు!
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు.. బీఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే బిగ్‌ స్ట్రోక్!
రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు.. బీఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే బిగ్‌ స్ట్రోక్!
రెడ్ అలెర్ట్ తారుమారు.. చుక్క వర్షం లేకుండా ఒక్కసారిగా తుఫాన్.!
రెడ్ అలెర్ట్ తారుమారు.. చుక్క వర్షం లేకుండా ఒక్కసారిగా తుఫాన్.!
లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.
లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.
'స్టోన్ ఫ్రూట్స్' అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.!
'స్టోన్ ఫ్రూట్స్' అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.!
రైల్వే రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇక నుంచి కొత్త రూల్స్‌ ఇవే.!
రైల్వే రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇక నుంచి కొత్త రూల్స్‌ ఇవే.!
గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్
గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్
25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం! వ్యక్తిపై 9 ఏళ్ల బాలిక ప్రతీకారం
25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం! వ్యక్తిపై 9 ఏళ్ల బాలిక ప్రతీకారం