అసోంలో భారీగా ఆయుధాలు స్వాధీనం

అసోంలో శుక్రవారం భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పక్కా సమాచారం అందడంతో ఉదల్‌గురి ప్రాంతంలో స్థానిక పోలీసులు గౌహతీ..

అసోంలో భారీగా ఆయుధాలు స్వాధీనం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 14, 2020 | 8:41 PM

అసోంలో శుక్రవారం భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పక్కా సమాచారం అందడంతో ఉదల్‌గురి ప్రాంతంలో స్థానిక పోలీసులు గౌహతీ పోలీసులతో కలిసి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ఏకే-47 రైఫిల్స్‌తో పాటుగా.. ఏకే-56 రైఫిల్స్‌, ఏకే-16 రైఫిల్స్‌ కూడా ఉన్నాయి. అంతేకాదు.. 9 ఎంఎం పిస్టల్స్‌తో పాటుగా.. ఎయిర్‌ గన్స్‌, మ్యాగజైన్స్‌, హ్యాండ్ గ్రేనేడ్స్‌, మందుగుండు సామాగ్రి, ఇతర పేలుడు పదార్ధాలు ఉన్నాయి. అయితే పట్టుబడ్డ ఈ ఆయుధాలు నేషనల్‌ డెమెక్రటిక్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ బోడోల్యాండ్‌కు చెందినవిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపడుతున్నామన్నారు.

Read More :

దంతేవాడలో పెద్ద ఎత్తున లొంగిపోయిన మావోలు

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం