PMO Review: సహాయ చర్యలపై ఉన్నతస్థాయి సమీక్ష.. వరద నుంచి కోలుకోని తమిళనాడు

తమిళనాడు మిచౌంగ్ నుంచి ఇంకా కోలుకోలేదు. భారీ వర్షాల కారణంగా అనేక ఇళ్లు నేలకూలాయి. కొన్ని ప్రాంతాలు అయితే జలదిగ్భందంలో ఉండిపోయాయి. ఎటు చూసినా నీరే కనిపిస్తోంది. మరికొన్ని జిల్లాల్లో వరద తగ్గినా బురద తీవ్ర ఇబ్బందికి గురిచేస్తోంది. కొన్ని వేల హెక్టార్ల పంట నీట మునిగింది. రైతులు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు.

PMO Review: సహాయ చర్యలపై ఉన్నతస్థాయి సమీక్ష.. వరద నుంచి కోలుకోని తమిళనాడు
Tamil Nadu Floods

Updated on: Dec 24, 2023 | 5:13 PM

తమిళనాడు మిచౌంగ్ నుంచి ఇంకా కోలుకోలేదు. భారీ వర్షాల కారణంగా అనేక ఇళ్లు నేలకూలాయి. కొన్ని ప్రాంతాలు అయితే జలదిగ్భందంలో ఉండిపోయాయి. ఎటు చూసినా నీరే కనిపిస్తోంది. మరికొన్ని జిల్లాల్లో వరద తగ్గినా బురద తీవ్ర ఇబ్బందికి గురిచేస్తోంది. కొన్ని వేల హెక్టార్ల పంట నీట మునిగింది. రైతులు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల నడుమ కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు ప్రజలకు సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్దమయ్యాయి. కేంద్రం నుంచి అండగా ఉంటామని ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‎కు ధైర్య చెప్పారు. గతంలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాలు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం వరద బాధితులకు ఆహారం, మంచి నీళ్లు సరఫరా చేస్తున్నారు. గతంలో కొన్ని సహాయ సంస్థలు వరద బాధితులకు దుప్పట్లు అందించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‎నాథ్ సింగ్ కూడా వారం క్రితం అక్కడి పరిస్థితిని తెలుసుకునేందుకు పర్యవేక్షించారు.

ఈ నేపథ్యంలో తమిళనాడులో సహాయ, పునరావాస చర్యలను సమీక్షించింది ప్రధాన మంత్రి కార్యాలయం. తమిళనాడులో వరదల అనంతర పరిస్థితిని సమీక్షించడంతో పాటు రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ఈ రోజు పీఎంవోలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. వరదల అనంతరం జరిగిన సహాయంతో పాటు భవిష్యత్తు కార్యచరణపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. తమిళనాడులోని ప్రభుత్వ ఉన్నతాధికారులతో పీఎంవో అధికారులు మాట్లాడారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు.. అక్కడి ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు కేంద్రం హెలికాప్టర్‌తో ఎన్‌డిఆర్‌ఎఫ్‌తో పాటు సాయుధ బలగాలను మోహరించింది. మరిన్ని సహాయక చర్యలు అవసరమైతే తమకు సమాచారం అందించాలని సూచించారు. పంట, ప్రాణ, ఆస్తి నష్టాన్ని అంచనా వేసేందుకు రాష్ట్రంలోని మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసుకుని కేంద్ర బృందం పర్యటనపైన చర్చించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..