PM Modi: ప్రధానిగా నరేంద్ర మోదీ పదేళ్ల ప్రస్థానం.. ఎర్రకోటపై మాట ఇస్తే నెరవేర్చే వరకు పంతం..!

పదేళ్ల పాలనలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన స్పెషాలిటీని నిరూపించుకున్నారు. 2014లో స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోటపై ఇచ్చిన హామీల రిపోర్ట్‌ కార్డును ప్రజల ముందు ఎప్పటికప్పుడు పెడ్తున్నారు. గత ప్రధానమంత్రులతో పోలిస్తే ఆచరణలో ఒక కొత్త ఒరవడిని మోదీ సృష్టించారు.

PM Modi: ప్రధానిగా నరేంద్ర మోదీ పదేళ్ల ప్రస్థానం.. ఎర్రకోటపై మాట ఇస్తే నెరవేర్చే వరకు పంతం..!
Pm Modi Red Fort
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 15, 2024 | 7:28 AM

పదేళ్ల పాలనలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన స్పెషాలిటీని నిరూపించుకున్నారు. 2014లో స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోటపై ఇచ్చిన హామీల రిపోర్ట్‌ కార్డును ప్రజల ముందు ఎప్పటికప్పుడు పెడ్తున్నారు. గత ప్రధానమంత్రులతో పోలిస్తే ఆచరణలో ఒక కొత్త ఒరవడిని మోదీ సృష్టించారు.

నాటి ప్రధానమంత్రులకు.. నరేంద్ర మోదీకి తేడా చాలా ఉంది. ఆచరణలో అమలులో మోదీ స్టయిలే వేరు.. మాట ఇచ్చారంటే నెరవేర్చే వరకు మోదీ విశ్రమించే ప్రసక్తే ఉండదు. దీనికి ప్రధాని పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఎర్రకోటపై మోదీ చేస్తున్న ప్రసంగాలే నిదర్శనం… ఎర్రకోటపై ప్రకటించిన ప్రతి వాగ్ధానాన్ని అమలు చేస్తున్నారు మోదీ.

భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నుంచి రాజీవ్‌ గాంధీ ప్రసంగాలతో పోలిస్తే మోదీ ప్రసంగాలు డిఫరెంట్‌గా ఉంటాయి. ఈ నేతల ప్రసంగాలు చాలావరకు కొత్త లక్ష్యాన్ని నిర్ధేశించకుండా.. పాత మాటలనే చాలా వరకు రిపీట్‌ చేస్తుంటాయి. తాము ఏం చేస్తామో చెప్పకుండా వేరే వాళ్ల కారణంగానే పనులు జరగడం లేదని ఆ నేతలు చెబుతుండేవాళ్లు. దేశప్రజలను ఉత్తేజపర్చే విధంగా కాకుండా .. పేద దేశాలతో తరచుగా పోల్చుకుంటూ మనస్దాయిని దిగజార్చే ప్రయత్నాలు చేశారని వాళ్లపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. అంతేకుండా మేము చెప్పా.. మీరు ఆచరించాలన్న ధోరణి అ ప్రసంగాల్లో ఉండేది. కాని మోదీ మాత్రం అలా కాదు..

నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌ స్వాతంత్ర్య పోరాటానికి వారసులమని తరచుగా ప్రకటించుకునేవాళ్లు. కానీ గొప్ప ప్రజా ఉద్యమాన్ని నిర్మించిన చరిత్ర ఈ ముగ్గురిలో ఒక్కరికి కూడా లేదు. అంతేకాదు.. తమ పనితీరుపై పోగ్రెస్‌ కార్డును వాళ్లు ఎప్పుడు ప్రజలకు చూపించే ప్రయత్నం చేయలేదు. మోదీ ప్రతిసారి తన ప్రోగ్రెస్‌ కార్డును ప్రజల ముందుంచుతారు. పాతతరం నేతలకు మోదీకి మధ్య ఉన్న వ్యత్యాసం ఇదే..! నెహ్రు ప్రతిసారీ తన ప్రసంగంలో ద్రవ్యోల్బణాన్ని ప్రస్తావించేవారు. కాని అధిక ధరల కట్టడికి పరిష్కారాన్ని మాత్రం చూపించలేకపోయేవారు.

2014లో ప్రధానిగా తొలిసారి బాధ్యతు స్వీకరించారు నరేంద్ర మోదీ.. ప్రతి ఇంటికి బ్యాంకింగ్‌ సౌకర్యం కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఏడాది తరువాత 2015లో తన రిపోర్ట్‌ కార్డును మోదీ ఇచ్చారు. ఏడాది కాలంలో 17 కోట్ల జీరో బ్యాలెన్స్‌ ఖాతాలు తెరిచారు.. అంతేకాదు పదేళ్లలో బ్యాంకింగ్‌ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు.. జన్‌థన్‌ ఖాతాలు 53 కోట్లు చేరాయి. 2014 లోనే ప్రతి ఇంటికి టాయ్‌లెట్‌ సౌకర్యం ఉంటుందని హామీ ఇచ్చారు మోదీ.. 2021 నాటికి ఈ లక్ష్యం 100 శాతం పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు. మహిళల సామాజిక , ఆర్ధిక అభ్యున్నతికి కృషి చేశారు.

మేక్‌ ఇన్‌ ఇండియా నినాదాన్ని కూడా తాను ప్రధాని పగ్గాలు చేపట్టిన 2014 లోనే తీసుకొచ్చారు మోదీ.. 2021లో దీనిపై రిపోర్ట్‌ కార్డును ఇచ్చారు. కోవిడ్‌ తరువాత తయారీ రంగంలో భారత్‌ మేటిగా దూసుకెళ్లింది. గ్లోబల్‌ సప్లై చైన్‌లో కీలకపాత్ర పోషించింది. ఆత్మ నిర్భర్‌ భారత్‌ నినాదం ప్రపంచవ్యాప్తంగా దూసుకెళ్లింది. దిగుమతుల స్థాయి నుంచి ఎన్నో రకాల ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి భారత్‌ చేరుకుంది.

2014 లోనే లాల్‌ బహదూర్‌ శాస్త్రి నినాదం జై జవాన్‌ – జైకిసాన్‌ నినాదాన్ని మోదీ ఎత్తుకున్నారు. రైతుల జీవితాల్లో వెలుగులు నింపడానికి గత 10 ఏళ్లలో ఎన్నో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొచ్చారు. పీఎం కిసాన్‌ సంపద యోజన , కిసాన్‌ సమ్మాన్‌ నిధిల ఏర్పాటుతో 2019లో వ్యవసాయరంగంపై తన రిపోర్ట్‌ కార్డును ప్రజల ముందుపెట్టారు. వ్యవసాయాన్ని పండగ చేస్తానని చెప్పిన మోదీ.. ఆచరణలో కూడా చూపిస్తున్నారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు.

అమేజింగ్.. చల్లటి నీళ్లతో చలికాలంలో స్నానం చేస్తే ఎన్ని లాభాలో..
అమేజింగ్.. చల్లటి నీళ్లతో చలికాలంలో స్నానం చేస్తే ఎన్ని లాభాలో..
అలాంటి మాటలను అస్సలు పట్టించుకోను.. టాలీవుడ్ హీరోయిన్
అలాంటి మాటలను అస్సలు పట్టించుకోను.. టాలీవుడ్ హీరోయిన్
భార‌త్‌ను చూసి నేర్చుకోవాలి: మాజీ జర్మన్ రాయబారి
భార‌త్‌ను చూసి నేర్చుకోవాలి: మాజీ జర్మన్ రాయబారి
ఆసియా కప్ టైటిల్‌ మనదే.. ఫైనల్‌లో బంగ్లాపై ఘన విజయం
ఆసియా కప్ టైటిల్‌ మనదే.. ఫైనల్‌లో బంగ్లాపై ఘన విజయం
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
మేక పాలు తాగితే శరీరానికి ఎంత మంచిదో తెలుసా..? ఈ వ్యాధులకు అమృతం!
మేక పాలు తాగితే శరీరానికి ఎంత మంచిదో తెలుసా..? ఈ వ్యాధులకు అమృతం!
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 8 టీంల మహా జాతరకు రంగం సిద్ధం
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 8 టీంల మహా జాతరకు రంగం సిద్ధం
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పార్సిల్‌లో వచ్చిన ఆ డెడ్ బాడీ ఎవరిది..?
పార్సిల్‌లో వచ్చిన ఆ డెడ్ బాడీ ఎవరిది..?
3 చారిత్రక ప్యాలెస్‌ల్లో సింధు వివాహ వేడుకలు.. ఎక్కడెక్కడో తెలుసా
3 చారిత్రక ప్యాలెస్‌ల్లో సింధు వివాహ వేడుకలు.. ఎక్కడెక్కడో తెలుసా
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో