PM Modi – Joe Biden: యుద్ధ సమయంలో అగ్రనేతల భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకోనున్న ప్రధాని మోడీ – బైడన్

India - US: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా జరుగుతోంది. దాదాపు నెలన్నర నుంచి కొనసాగుతున్న ఈ యుద్ధంపై ప్రపంచ దేశాలన్నీ ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌

PM Modi - Joe Biden: యుద్ధ సమయంలో అగ్రనేతల భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకోనున్న ప్రధాని మోడీ - బైడన్
Pm Modi Joe Biden
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 11, 2022 | 7:21 AM

India – US: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా జరుగుతోంది. దాదాపు నెలన్నర నుంచి కొనసాగుతున్న ఈ యుద్ధంపై ప్రపంచ దేశాలన్నీ ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi), అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) ఈ రోజు భేటీ అవుతుండటం ప్రధాన్యం సంతరించుకుంది. వర్చువల్ ద్వారా ఇద్దరు నేతలు భేటీ కానున్నారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంపై భారత్‌ తటస్థ వైఖరితో ఉన్న సమయంలో మోడీ – బైడెన్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. మోడీ, బైడన్ పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించనున్నారు. దక్షిణాసియాతో పాటు ఫసిఫిక్‌ ప్రాంతంలో నెలకొన్ని తాజా పరిస్థితులపై చర్చలు జరపనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఇరుదేశాల మధ్య మరింత భాగస్వామ్యం పెరిగేలా చర్యలు తీసుకోబోతున్నారు. రక్షణరంగం, ఆర్ధిక రంగాల్లో సహకారంపై కూడా చర్చలు జరుగనున్నాయి.

రక్షణరంగం, ఆర్ధిక రంగాల్లో పరస్పర సహకారం, ప్రజాసంబధాలపై కూడా మోడీ-బైడెన్‌ చర్చించనున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర పరిణామాలపై, ప్రపంచ ఆహార సరఫరా, అంతర్జాతీయ మార్కెటింగ్ బలోపేతం, కరోనా మహమ్మారి అంతానికి తీసుకోవాల్సిన చర్యలు, వాతావరణ పరిస్థితులు తదితర అంశాలపై చర్చించనున్నారు. అయితే ఉక్రెయిన్ పరిస్థితులు, భారత వైఖరిపై అగ్రరాజ్యం పలుమార్లు భారత్‌ను ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మోడీ-బైడన్ మధ్య జరిగే వర్చువల్ భేటీపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

కాగా.. అమెరికా-భారత్ 2+2 విదేశాంగ మంత్రిత్వ శాఖల మధ్య జరిగే చర్చలకు ముందు ఈ సమావేశం జరుగుతుందని ఇరుదేశాలు పేర్కొన్నాయి. ఆంటోనీ బ్లింకెన్, రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్, విదేశాంగ మంత్రి డా. సుబ్రహ్మణ్యం జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ భేటీలో పాల్గొననున్నారు.

Also Read:

నెక్ట్స్ లెవల్ ‘లవ్ స్టోరీ’.. ప్రియుడికి బెయిల్ కోసం ప్రియురాలు అప్పు చేస్తే.. ఆ అప్పు చెల్లించేందుకు ప్రియుడు చోరీ చేస్తాడు..!

Pan Card Loan Cheating: మీ పాన్ కార్డ్ దుర్వినియోగమైందా? ఆన్‌లైన్‌లో ఇలా చెక్ చేసుకోండి..!