నెక్ట్స్ లెవల్ ‘లవ్ స్టోరీ’.. ప్రియుడికి బెయిల్ కోసం ప్రియురాలు అప్పు చేస్తే.. ఆ అప్పు చెల్లించేందుకు ప్రియుడు చోరీ చేస్తాడు..!

నెక్ట్స్ లెవల్ ‘లవ్ స్టోరీ’.. ప్రియుడికి బెయిల్ కోసం ప్రియురాలు అప్పు చేస్తే.. ఆ అప్పు చెల్లించేందుకు ప్రియుడు చోరీ చేస్తాడు..!
Chittoor man Arrested

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. లాకప్‌లో ఉన్న ప్రేమికుడిని బయటకు తీసుకురావడానికి

Shiva Prajapati

|

Apr 11, 2022 | 6:55 AM

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. లాకప్‌లో ఉన్న ప్రేమికుడిని బయటకు తీసుకురావడానికి అతని ప్రియురాలు అప్పులు చేసి బెయిల్ ఇప్పించడం.. ఆ అప్పులను తిరిగి చెల్లించడం కోసం ప్రేమికుడు మళ్లీ చోరీలకు పాల్పడుతున్న డైలీ సీరియల్ కథ సంచలనంగా మారింది. విజయ్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ తహజీబ్ ఖాజీ తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగర్ కు చెందిన విశాల్ ననేరియా అనే యువకుడుని పోలీసులు తనిఖీలు చేస్తూ అడ్డుకున్నారు. అతని గురించి విచారించగా.. దోపిడిదారుడిగా తేలింది. దీంతో పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అతనిపై కేసు నమోదు చేశారు.

ప్రియుడు అరెస్ట్ అవగానే పోలీస్ స్టేషన్‌కు ప్రియురాలి.. యువకుడి అరెస్ట్ విషయం అతని ప్రియురాలికి తెలిసింది. వెంటనే ఆమె పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. ప్రియురాలు తన ప్రేమికుడిని విడుదల చేయాలని స్టేషన్‌ ఇన్‌చార్జిని వేడుకుంది. స్టేషన్‌ ఇన్‌చార్జి ప్రియురాలిని విచారించగా.. తన బాయ్‌ఫ్రెండ్‌ ఏదో ఒక కేసులో జైలుకు వెళ్తుంటాడని, అతన్ని బెయిల్‌పై విడిపించడానికి తాను డబ్బు అప్పుగా తీసుకురావడం పరిపాటి అయ్యిందని చెప్పింది. ఇక అప్పులు ఇచ్చిన వారు ఇంటి వద్దకు వచ్చి.. అప్పు తిరిగి చెల్లించాలని గొడవ చేసేవారని చెప్పుకొచ్చింది. ఈ అప్పులను తీర్చేందుకు తన ప్రియుడు మళ్లీ చోరీలకు పాల్పడేవాడని పేర్కొంది. ఈ సీరియల్ కథ విని పోలీసులు షాక్ అయ్యారు.

Also read:

Food Coma: రాత్రి పూట తిన్న వెంటనే నిద్ర పోతున్నారా.. అయితే మీరు వీటిన తినడం మానేయాలి.. లేకుంటే ప్రమాదమే

Gold Silver Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. స్థిరంగా ఉన్న బంగారం.. పెరిగిన వెండి ధర..!

Saving Account: సేవింగ్స్ ఖాతాపై 5% వడ్డీ ఇస్తోన్న బ్యాంక్.. కనీస మొత్తం ఎంత ఉండాలంటే..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu