PM Narendra Modi: కాంగ్రెస్‌పై మరోసారి విరుచుకుపడిన ప్రధాని మోడీ.. ఆ పార్టీ లేకుంటే ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తేవి కావని ఘాటు విమర్శలు..
PM Modi in Rajya Sabha : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) మరోసారి కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ఆ పార్టీ చేస్తోన్న వారసత్వ రాజకీయాలు దేశానికి ఎంతో ప్రమాదకరమన్నారు.

PM Modi in Rajya Sabha: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) మరోసారి కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ఆ పార్టీ చేస్తోన్న వారసత్వ రాజకీయాలు దేశానికి ఎంతో ప్రమాదకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ లేకుంటే దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తేవి కావని, సిక్కుల ఊచకోత లాంటి సంఘటనలు జరిగేవి కావని మోడీ ధ్వజమెత్తారు. అంజయ్య లాంటి సొంత పార్టీ నేతలనే అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకుందని మోడీ ధ్వజమెత్తారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో భాగంగా మంగళవారం రాజ్యసభలో ప్రధాని ఈ ఘాటు విమర్శలు చేశారు. కాగా జనవరి 31న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిద్ ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో (లోక్‌సభ, రాజ్యసభ) చర్చ జరుగుతోంది.
రాజ్యసభ నుంచి కాంగ్రెస్ వాకౌట్..
కాగా సోమవారం లోక్‌సభ చర్చలోనే కాంగ్రెస్‌పై ఘాటైన విమర్శలు చేసిన మోడీ మంగళవారం మరోసారి ఆ పార్టీపై విరుచుకుపడ్డారు. ‘కాంగ్రెస్ నేతల మైండ్‌సెట్ అర్బన్ నక్సలైట్లను తలపిస్తోంది. వారివల్లే దేశంలో అవినీతి చీడ వ్యాపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ విధానాల కారణంగానే కశ్మీర్ పండిట్లు కశ్మీర్‌ను విడిచి వెళ్లారు’ అని ప్రధాని ధ్వజమెత్తారు. కాగా మోడీ వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ నేతలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. కాగా నిన్న కూడా లోక్‌సభలో మోడీ కాంగ్రెస్‌పై నిప్పులుకక్కిన సంగతి తెలిసిందే. ఓటముల తర్వాత కూడా కాంగ్రెస్ కు అహంకారం తగ్గలేదని విమర్శించారు. కాంగ్రెస్‌కు తానంటేప్రాణమని, మోడీ లేకుండా వారు ఒక్క క్షణం కూడా జీవించలేరని విమర్శించారు. కరోనా సమయంలో కాంగ్రెస్ తన హద్దులను దాటి ప్రవర్తించిందని ప్రధాని మోడీ ఆరోపణలు గుప్పించారు. కరోనా వైరస్ వ్యాప్తిని చేసింది వారేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Also Read:Cigarette: సిగరెట్ మానేసిన రెండో రోజు నుంచే మార్పులు.. 3 నుంచి 6 వారాల్లో ఎంత తేడా అంటే..?