PM Modi: చిన్నారులను ఆకట్టుకోవడానికి మ్యాజిక్ ట్రిక్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ

| Edited By: TV9 Telugu

Nov 16, 2023 | 2:02 PM

భారత ప్రధాని నరేంద్ర మోదీకి పిల్లలపై ఉన్న ప్రేమ అందరికీ తెలిసిందే. ఎక్కడ పిల్లలు కనిపించినా వారిపై తన ప్రేమను కురిపించడంలో మోదీ ఏమాత్రం వెనుకంజ వేయలేదు. వారితో మమేకమవుతూ.. సరదాగా గడుపుతుంటారు. ప్రధాని మోదీ తన ఒడిలో పిల్లలను కూర్చొబెట్టుకుని తినిపించడం, చాక్లెట్లు ఇవ్వడం, కొంచెం పెద్ద పిల్లలతో ఆడుకోవడం అంటే ప్రధాని మోదీకి చాలా ఇష్టం.

PM Modi: చిన్నారులను ఆకట్టుకోవడానికి మ్యాజిక్ ట్రిక్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ
Pm Modi Plays With Children
Follow us on

భారత ప్రధాని నరేంద్ర మోదీకి పిల్లలపై ఉన్న ప్రేమ అందరికీ తెలిసిందే. ఎక్కడ పిల్లలు కనిపించినా వారిపై తన ప్రేమను కురిపించడంలో మోదీ ఏమాత్రం వెనుకంజ వేయలేదు. వారితో మమేకమవుతూ.. సరదాగా గడుపుతుంటారు. ప్రధాని మోదీ తన ఒడిలో పిల్లలను కూర్చొబెట్టుకుని తినిపించడం, చాక్లెట్లు ఇవ్వడం, కొంచెం పెద్ద పిల్లలతో ఆడుకోవడం అంటే ప్రధాని మోదీకి చాలా ఇష్టం. ఇందుకు సంబంధించిన ఇలాంటి వీడియోలు నిరంతరం కనిపిస్తూనే ఉంటాయి. అందులో ఆయన పిల్లలతో నవ్వుతూ, ఆడుకుంటూ కనిపిస్తారు. తాజాగా మరో వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. ఇద్దరు పిల్లలతో ఆడుకుంటున్న మరో వీడియోను భారతీయ జనతా పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసింది. ఈ వీడియోలో ఒక అమ్మాయి, ఆమె తమ్ముడు ప్రధాని మోదీని కలుసుకునేందుకు ఆయన నివాసానికి వచ్చారు. ఈ చిన్నారులు తమ తల్లిదండ్రులతో కలిసి ప్రధాని మోదీని కలిసేందుకు వచ్చారు. ముందుగా చిన్నారులకు ఎంతో ప్రేమ, ఆశీస్సులు అందించిన మోదీ.. ఆ తర్వాత వారితో ఆడుకోవడం ప్రారంభించారు.

ఈ గేమ్ 1 రూపాయి నాణెంతో ఉండటం అందరినీ అశ్చర్యానికి గురి చేసింది. చాలా మంది తమ చిన్నతనంలో 1 రూపాయి నాణెంతో ఇలాంటి ఆట ఆడే ఉంటారు. ఈ పిల్లలతో మోడీ ఎలా ఆడుకుంటూ నవ్వుతున్నాడో చూడండి.

చిన్నారులతో ప్రధాని మోదీ సరదా ఆట (Watch PM Modi Having Fun With Children)

ప్రధాని మోదీకి సంబంధించిన మరో వీడియో కూడా వైరల్‌గా మారింది. ఆ వీడియోలో, ప్రధాని మోదీ ఒక కార్యక్రమంలో తన ఒడిలో ఉన్న చిన్న పిల్లవాడిని లాలించడం కనిపించింది. చిన్నారిని తన ఒడిలోకి తీసుకుని వాకింగ్‌కు తీసుకెళ్లమని కోరడం కనిపించింది. మీ ఇంట్లోనూ, మా ఇంట్లోనూ పెద్దలు పిల్లాడిని బయటికి తీసుకెళ్ళడం గురించి మాట్లాడినట్లుగా. ఈ చిన్నారితో మోదీ కూడా చాలా సంతోషంగా గడిపారు.

ఇదే కాకుండా వందేభారత్ రైలు, మెట్రో రైలు ఎక్కడ ప్రారంభమైనా మోదీ కూడా పిల్లవాడిగా మారిపోతారు. రైలును ప్రారంభించిన తర్వాత, ప్రధాని మోదీ అందులో ప్రయాణిస్తున్న పిల్లలతో మాట్లాడతారు. వారి చదువు, మంచి చెడుల గురించి ఆరా తీస్తుంటారు. భారతదేశ ప్రజలను తన కుటుంబంలో భాగం అని పిలిచే ప్రధాని మోదీని కలిసిన తర్వాత పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తుంటారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షెడ్యూల్ ఎప్పుడు చాలా బిజీగా ఉంటుంది. ప్రస్తుతం జరుతుున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు ఆయన 5 రాష్ట్రాల్లో నిరంతరం పర్యటిస్తున్నారు. ఒక్క మధ్యప్రదేశ్‌లోనే మోదీ 7 రోజుల్లో 14 బహిరంగ సభలు నిర్వహించారు. దీంతో పాటు రాజస్థాన్‌, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ల్లో ఎన్నికల పర్యటన కూడా చేస్తున్నారు. అయినప్పటికీ, పిల్లలను కలవడానికి ప్రధాని మోదీ వెనుకాడరు. మోదీకి ఎక్కడ పిల్లల సాంగత్యం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోవడం మిస్ కాకుండా వారితో చిన్నపిల్లాడిలా తయారవుతుంటారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…