Pariksha Pe Charcha 2022: ప్రధాని మోడీ(PM Modi) ప్రతి సంవత్సరం పరీక్షల ముందు నిర్వహించే “పరీక్షా పే చర్చా ” 5వ ఎడిషన్ కార్యక్రమం నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 1, 2022న దేశవ్యాప్తంగా బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతో సంభాషించనున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు PM మోడీతో ముఖాముఖి మాట్లాడే అవకాశం ఉంటుంది. గత సంవత్సరం, COVID-19 మహమ్మారి కారణంగా ఏప్రిల్‌లో ఈ ఈవెంట్ వర్చువల్ మోడ్‌లో నిర్వహించారు. మోడీతో ఈ చర్చలో పాల్గొనడానికి ఆసక్తి కలిగిన విద్యార్థులు innovateindia.mygov.inలో మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. ఈ పరీక్షా పే చర్చా కార్యక్రమంలో విద్యార్థులు పరీక్షల ఒత్తిడిని ఎలా అధిగమించాలనే విషయంపై అభిప్రాయాలను వెల్లడించనున్నారని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ఈ సంవత్సరం త్వరలో పరీక్షల సీజన్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో పరీక్షలకు హాజరయ్యే స్టూడెంట్స్ ప్రశాంతంగా , రిలాక్స్‌గా ఎలా ఉండాలో ప్రధాని మోడీ విద్యార్థులకు పలు సూచనలు చేయనున్నారు. పరీక్షల కోసం ఎలా సిద్ధమవ్వాలి అనే విషయంపై ప్రధాన మంత్రి విద్యార్థులతో సంభాషించనున్నారు. ఈ కార్యక్రమంకి విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అడిగే పలు ప్రశ్నలకు ప్రధాని సమాధానాలిస్తారు.
The wait is now over! The 5th edition of #PPC2022 is going to be held on 1st April, 2022 at Talkatora Stadium, New Delhi. Hon’ble PM Shri @narendramodi will interact with students & share his insights on how to beat exam stress. Stay Tuned! #ExamWarriors pic.twitter.com/j36wWLvDrZ
— Ministry of Education (@EduMinOfIndia) March 24, 2022
పరీక్షా పె చర్చ 2022: రిజిస్ట్రేషన్లు
పరీక్షపై చర్చ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానించారు. 9 నుండి 12 తరగతుల విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు mygov.in ని సందర్శించి దరఖాస్తు చేసుకోవాలని గతంలోనే ప్రధాని మోడీ ట్విట్టర్ ద్వారా కోరారు.
“పరీక్ష పే చర్చ”: ఇది ఒక అద్భుతమైన అనుభవం అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. అంతేకాదు ఈ కార్యక్రమం శక్తివంతమైన యువతతో కనెక్ట్ అవ్వడానికి… వారి సవాళ్లను, ఆకాంక్షలను మరింతగా అర్ధం చేసుకునే అవకాశాన్ని కూడా ఇస్తుందని చెప్పారు. 9, 10, 11 , 12 తరగతుల పాఠశాల విద్యార్థులు మాత్రమే కార్యక్రమంలో భాగం కాగలరు. విద్యార్థులు తమకు కేటాయించిన ఒక థీమ్‌లో మాత్రమే పాల్గొనగలరు. ప్రతి విజేతకు డైరెక్టర్, ఎన్‌సిఇఆర్‌టి నుండి ప్రశంసా పత్రం, విజేతలకు ప్రత్యేక పరీక్షా పే చర్చా కిట్‌ను హిందీ , ఇంగ్లీషులో ప్రధాని మోడీ రాస్తారు.
త్వరలో పరీక్షలు రాయనున్న తొమ్మిది నుంచి 12వ తరగతి విద్యార్థులల్లో భయాందోళనలను తొలగించడానికి 2018 నుంచి ప్రధాని మోదీ పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ‘పరీక్ష పే చర్చ’ మొదటి ఎడిషన్ 16 ఫిబ్రవరి 2018న తాల్కటోరా స్టేడియంలో నిర్వహించారు.
Also Read: Chanakya Niti: ఆరోగ్యాన్ని, సంపదను సైనికుడిలా రక్షించమంటున్న చాణక్య ఎందుకంటే..