PM MODI: అదో భయంకరమైన రోజు.. స్వాతంత్ర సంబరాలకు ముందు రోజును గుర్తు చేసుకున్న ప్రధాని మోడీ..

|

Aug 14, 2021 | 12:22 PM

Partition Horrors Remembrance Day: 15 ఆగస్ట్ స్వాతంత్ర్య దినోత్సవం జరగనుండగా.. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. ఆగస్ట్ 14ను విభజన భయానక జ్ఞాపకాల దినోత్సవంగా జరుపుకోవాలని భారత దేశ ప్రజలకు...

PM MODI: అదో భయంకరమైన రోజు.. స్వాతంత్ర సంబరాలకు ముందు రోజును గుర్తు చేసుకున్న ప్రధాని మోడీ..
Modi Partition Horrors Reme
Follow us on

15 ఆగస్ట్ స్వాతంత్ర్య దినోత్సవం జరగనుండగా.. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. ఆగస్ట్ 14ను విభజన భయానక జ్ఞాపకాల దినోత్సవంగా జరుపుకోవాలని భారత దేశ ప్రజలకు పిలునిచ్చారు. భారత్ కు స్వాతంత్ర్యం ఇచ్చే ముందు బ్రిటీష్ పాలకులు.. ఇండియాని రెండు ముక్కలుగా విభజించి.. పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా మార్చారు. అప్పట్లో ఈ నిర్ణయం చాలా మందికి నచ్చలేదు. ఈ విభజన సమయంలో  ఇండియాలో చాలా మంది పాకిస్తాన్‌కీ, పాకిస్తాన్‌లో చాలా మంది ఇండియాకీ వలస వచ్చారు. ఇదంతా అప్పట్లో పెద్ద చారిత్రాత్మక అంశంగా మారింది. అదే సమయంలో భారత్ నుంచి వెళ్లిన వారు సురక్షితంగా పాకిస్తాన్ చేరుకున్నారు. అయితే పాకిస్తాన్ నుంచి భారత్ వస్తున్న వారిని చిత్ర హింసలకు గురి చేశారు. అప్పటి ఆ సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని ప్రధాని మోదీ ఓ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.

ప్రతి సంవత్సరం ఆగస్ట్ 14న పాకిస్తాన్.. స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. “విభజన బాధల్ని ఎప్పటికీ మర్చిపోలేం. లక్షల మంది మన సోదర సోదరీమణులు.. తరలిపోవాల్సి వచ్చింది. చాలా మంది అప్పట్లో జరిగిన హింసలో ప్రాణాలు కోల్పోయారు. అప్పటి మన ప్రజల బాధలు, త్యాగాలను గుర్తు చేసుకుంటూ.. ఆగస్ట్ 14ను మనం విభజన భయానక జ్ఞాపకాల దినంగా జరుపుకుందాం” అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి: TMC – BJP: ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది.. తేల్చి చెప్పిన దీదీ ప్రధాన అనుచరుడు.. ఇదో కొత్త రకం గేమ్..

FAKE CHALLAN SCAM: ఏపీలో సరికొత్త నకిలీ వైరస్.. ఇది సోకితే.. రాష్ట్ర ఖజానా శంకరగిరి మాన్యాలేనట.. ఫోకస్ పెట్టిన సీఎం జగన్