PM Narendra Modi: గోవా లిబ‌రేష‌న్ డే వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ.. అమరవీరులకు నివాళులు..

| Edited By: Anil kumar poka

Dec 23, 2021 | 6:27 PM

PM Narendra Modi Goa Visit: వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టిసారించారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాల్లో క్షేత్ర స్థాయిలో

PM Narendra Modi: గోవా లిబ‌రేష‌న్ డే వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ.. అమరవీరులకు నివాళులు..
Pm Narendra Modi
Follow us on

PM Narendra Modi Goa Visit: వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టిసారించారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి యూపీలో పర్యటించిన ప్రధాని మోదీ.. ఈ రోజు గోవాలో పర్యటించారు. ఆదివారం జరిగిన గోవా లిబ‌రేష‌న్ డే ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. గోవాలోని డాక్టర్ శ్యామప్రసాద్ ముఖ‌ర్జి స్టేడియంలో గోవా విమోచన దినోత్సవ (గోవా లిబ‌రేష‌న్ డే ) వేడుకలు జ‌రుగుతున్నాయి. ఈ సంద‌ర్భంగా భార‌త భూభాగాలైన‌ గోవా, డామ‌న్ అండ్‌ డ‌య్యూ ప్రాంతాల విముక్తి కోసం పోరాడిన వారిని, 1961లో ఆప‌రేష‌న్ విజ‌య్‌లో పాల్గొన్నవారిని ప్రధాని మోదీ స‌త్కరించారు. ఆపరేషన్ విజయ్ అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.

స్టేడియానికి చేరుకున్న ఆయనకు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ స్వాగతం పలికారు. అంతకుముందు ఆజాద్ మైదాన్‌లోని అమరవీరుల స్మారక చిహ్నం వద్ద అమరవీరులకు ప్రధాని నివాళులర్పించారు. మిరామార్ బీచ్‌లో గోవా విమోచన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సేల్ పరేడ్, ఫ్లైపాస్ట్‌లో కూడా ఆయన పాల్గొన్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు.


‘ఆపరేషన్ విజయ్’ స్వాతంత్ర్య సమరయోధులను ప్రధాని మోదీ సత్కరించారు. పోర్చుగీస్ పాలన నుంచి గోవాను విముక్తి చేయడానికి భారత సాయుధ దళాలతో ఈ ఆపరేషన్ జరిగింది. ఆ తర్వాత న్యూ సౌత్ గోవా డిస్ట్రిక్ట్ హాస్పిటల్, పునరుద్ధరించిన అగౌడ జైలు మ్యూజియం, గోవా మెడికల్ కాలేజీ సూపర్ స్పెషాలిటీ సెక్షన్ తో సహా వివిధ ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. అనంతరం మోపా విమానాశ్రయంలో ఏవియేషన్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.

గ్యాస్ సబ్ స్టేషన్ ప్రారంభం
దీని తర్వాత, మాండ్‌గావ్‌లోని డిబోనేషనల్ యూనివర్శిటీలో ఉన్న గ్యాస్ సబ్ స్టేషన్‌ను ప్రధాని ప్రారంభిస్తారని ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) తెలిపింది. ఆ తర్వాత న్యాయ విద్య, పరిశోధనలకు సంబంధించిన ఇండియన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేస్తారు. వచ్చే ఏడాది జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికలపై అన్ని పార్టీల దృష్టి కేంద్రీకరించిన తరుణంలో ప్రధాని గోవా పర్యటన జరుగుతోంది.

450 ఏళ్ల పోర్చుగీసు పాలన తర్వాత 1961లో కొత్త గోవా ఆవిర్భవించింది. భార‌త‌దేశానికి 1947లో స్వాతంత్ర్యం వ‌చ్చినా గోవా, డామ‌న్ అండ్ డ‌య్యూ ప్రాంతాలు పోర్చుగీస్‌ ఆధీనంలోనే ఉండేవి. దీంతో ఆయా ప్రాంతాల‌ను విముక్తం చేయ‌డం కోసం 1961లో భారత సైన్యం నిర్వహించిన ఆప‌రేష‌న్ విజయ్‌తో.. పోర్చుగీస్ నుంచి గోవాను విముక్తి పొందింది.

Also Read:

Alappuzha: కేరళ అలప్పుజలో టెన్షన్.. గంటల వ్యవధిలో ఇద్దరు రాజకీయ నాయకుల హత్య..

CJI NV Ramana: కోర్టుల్లో మౌలిక వసతులు ఉంటేనే పేదలకు సత్వరం న్యాయసేవలు అందుతాయిః ఎన్వీరమణ