బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు ప్రధాని మోదీ. ఢిల్లీ లోని బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌లో ఈ సమావేశం జరిగింది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చించారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూడా ఈ సమావేశంలో పోస్ట్‌మార్టమ్ చేశారు. బీజేపీ ఓటమిపై విశ్లేషణ జరుగుతోంది. దాదాపు ఆరుగంటల పాటు ఈ సమావేశం కొనసాగుతుంది. బీజేపీ అధ్యక్షుడు నడ్డా , హోంశాఖ మంత్రి అమిత్షా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆయా రాష్ట్రాల్లో అమలౌతున్న అభివృద్ది పథకాల గురించి సీఎంలు ప్రధాని మోదీకి వివరించారు. 2024 పార్లమెంట్ ఎన్నికల గురించి ప్రధాని మోడీతో ఆయా రాష్ట్రాల సీఎంలు చర్చించారు. ఈ ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై నేతలకు ప్రధాని దిశా నిర్ధేశం చేశారు.
ఈ సమావేశంలో మహరాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ , హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, అసోం సీఎం హిమంత బిశ్వాస్ , ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ,ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి,గుజరాత్ సీఎం భూపేంద్ర పాటిల్, నాగాలాండ్ డిప్యూటీ సీఎం యత్రుంగో , మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్త్రిపుర సీఎం మాణిక్ సాహా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. న్యూఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభించిన తర్వాత ఈ సమావేశం జరిగింది.
भारतीय जनता पार्टी के केंद्रीय कार्यालय में आज मुख्यमंत्री परिषद की बैठक संपन्न हुई।
प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व वाली केंद्र और उनके मार्गदर्शन में चल रहीं भाजपा शासित राज्य सरकारें, सबका साथ-सबका विकास के सूत्र को अपना कर राष्ट्र के सर्वांगीण विकास हेतु… pic.twitter.com/B95FyksiUk
— BJP (@BJP4India) May 28, 2023
2024 పార్లమెంట్ ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించి మూడో దఫా విజయం సాధించాలని బీజేపీ పట్టుదలగా ఉంది. ఆయా రాష్ట్రాల్లో ప్రత్యర్ధుల బలాలు, బలహీనతలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఏ వ్యూహాంతో ముందుకు వెళ్తే ఎక్కువ సీట్లు దక్కే అవకాశం ఉందనే విషయమై చర్చించనున్నారు. మరో వైపు ప్రధాని మోడీ 9 ఏళ్లలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయమై సీఎంలతో చర్చించనున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..