PM Modi: లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ కార్యకర్తలకు విజయ మంత్రం బోధించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే?

|

Feb 18, 2024 | 3:12 PM

ఢిల్లీలోని భారత మండపంలో నిర్వహిస్తున్న భారతీయ జనతా పార్టీ జాతీయ మండలి సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ కార్యకర్తలను ఉత్తేజపరిచారు. రాబోయే 100 రోజులు వారు ఉత్సాహంతో పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమయంలో ప్రతి ఓటరుకు చేరువ కావాలన్నారు.

PM Modi: లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ కార్యకర్తలకు విజయ మంత్రం బోధించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే?
Narendra Modi In Bjp Convention
Follow us on

ఢిల్లీలోని భారత మండపంలో నిర్వహిస్తున్న భారతీయ జనతా పార్టీ జాతీయ మండలి సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ కార్యకర్తలను ఉత్తేజపరిచారు. రాబోయే 100 రోజులు వారు ఉత్సాహంతో పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమయంలో ప్రతి ఓటరుకు చేరువ కావాలన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న బీజేపీ జాతీయ మహాసభల రెండో రోజు ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ – బీజేపీ కార్యకర్తలు 24 గంటలూ దేశానికి సేవ చేయడంలో నిమగ్నమై ఉన్నారని పేర్కొన్నారు.

బీజేపీ జాతీయ సదస్సులో కార్యకర్తలు, పార్టీ నేతలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. పార్టీ ప్రతిష్టతో పాటు దేశాభివృద్ధిలో పాలు పంచుకుంటున్న కార్యకర్తలందరికీ అభినందనలు తెలుపారు. బీజేపీ కార్యకర్తలు ఏడాదిలో ప్రతిరోజూ దేశానికి సేవ చేసేందుకు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారన్నారు. బీజేపీ కార్యకర్తలు 24 గంటలు దేశం కోసం కష్టపడుతున్నారన్నారు. కానీ ఇప్పుడు అసలు సమయం వచ్చింది. 100 రోజులు కొత్త శక్తితో, కొత్త ఉత్సాహంతో,కొత్త విశ్వాసంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రతిపక్ష నేతలు కూడా ఎన్డీయే 400 దాటిందంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ దేశాన్ని భారీ కుంభకోణాలు, ఉగ్రవాదం నుంచి బీజేపీ విముక్తి చేసింది. మనం శివాజీని నమ్మేవాళ్లం. దేశానికి సేవ చేసేందుకు బీజేపీకి అత్యధిక సీట్లు వస్తాయని మోదీ ధీమా వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పూర్తి ప్రసంగాన్ని ఇక్కడ చూడండి:

ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు స్పెషల్ టాస్క్ ఇచ్చారు ప్రధాని మోదీ. బీజేపీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తూ, ఫిబ్రవరి 18 అని, 18 ఏళ్లు నిండిన యువత 18వ లోక్‌సభను ఎన్నుకోబోతున్నారని అన్నారు. రానున్న రోజుల్లో ఏకాగ్రతతో ప్రతి ఓటరుకు, అన్ని వర్గాల వారికి చేరువ కావాలన్నారు. కార్యకర్తల కష్టానికి తప్పకుండా ఫలితం దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా ఆచార్య శ్రీ విద్యాసాగర్ జీ మహరాజ్‌ని తన ప్రసంగంలో స్మరించుకున్నారు ప్రధానమంత్రి. సమాజానికి ఆయన చేసిన అమూల్యమైన కృషికి, ముఖ్యంగా ప్రజలలో ఆధ్యాత్మిక జాగృతికి ఆయన చేసిన కృషి మర్చిపోలేమన్నారు. పేదరిక నిర్మూలన, వైద్యం, విద్య, మరిన్నింటి సౌకర్యాల కోసం ఆయన చేసిన కృషికి రాబోయే తరాలు గుర్తుండిపోతాయన్నారు. ఆయన ఆశీస్సులు దేశ ప్రజలందరికీ దక్కాలని మోదీ ఆకాంక్షించారు.

ప్రజల సంక్షేమం, దేశం కోసం పాటు పడుతున్న బీజేపీ కార్యకర్తలకు ఎక్కడా గర్వం లేదన్నారు ప్రధాని మోదీ. గతంకంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పదేళ్లలో ఎంతో అభివృద్ధి సాధించామని, అద్భుతమైన విజయాలు అందుకున్నామన్నారు. వికసిత్ భారత్ కోసం ప్రజలంతా కృషి చేస్తున్నారు. ప్రజల స్వప్నాలు తప్పకుండా సాకారమవుతాయి. రానున్న ఐదేళ్లు మనకు చాలా కీలకమని, అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దడానికి కష్టపడతామన్నారు ప్రధాని మోదీ. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారాలంటే.. దేశంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి రావాలన్నారు.

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అద్భుత విజయం అందుకోబోతున్నామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఎన్డీయే కూటమికి 400కు పైగా సీట్లు వస్తాయని, ఇక కేవలం భారతీయ జనతా పార్టీ ఒక్కటే 370 సీట్లు గెలుచుకోవడం ఖాయమన్నారు. ఉగ్రవాదం, అవినీతి నుంచి దేశానికి ముక్తి కల్పించామన్న మోదీ, పేదలు, మధ్యతరగతి ప్రజల జీవితాలు బాగుచేశామన్నారు. నన్ను విశ్రాంతి తీసుకోమని కొంత మంది సూచిస్తున్నారు. నాకు రాజకీయాలు ముఖ్యం కాదు.. దేశమే ముఖ్యం. శివాజీ నాకు స్ఫూర్తి.. అందుకే 24గంటలు దేశం గురించే ఆలోచిస్తా. నాకు వ్యక్తిగత ప్రతిష్ట, అధికారం ముఖ్యం కాదు. కుటుంబం కూడా ముఖ్యం కాదు. దేశ ప్రజలే నా కుటుంబమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.

ఇంకా చాలా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్న ప్రధాని, బీజేపీకి మహిళలు, పేదలు, యువత మద్ధతు ఇస్తున్నారన్నారు. సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తున్నామని, ఆదివాసీలు, విశ్వకర్మల కోసం ప్రత్యేక పథకాలు తెచ్చామన్నారు. భేటీ పడావ్, భేటీ బచావ్ నినాదానికి ప్రజలు మద్ధతు ఇచ్చారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే ఉరిశిక్ష వేస్తున్నామని హెచ్చరించారు. మహిళా సాధికారతే మా ప్రధాన లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ పునర్ఘాటించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…