మహిళా రిజర్వేషన్ బిల్లుపై ముందడుగు.. నవశకానికి నాంది పలికామన్న నరేంద్ర మోదీ..

|

Sep 19, 2023 | 2:00 PM

కొత్త పార్లమెంట్‌‌లోకి ప్రవేశించారు ఎంపీలు.. పాత పార్లమెంట్‌ భవనం నుంచి పాదయాత్రగా కొత్త పార్లమెంట్‌‌లోకి వెళ్లారు. ప్రధాని మోదీ ఎంపీల పాదయాత్రకు నేతృత్వం వహించారు. కొత్త పార్లమెంట్‌లో చారిత్రాత్మక బిల్లులను ఆమోదించబోతున్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు సాకారం కాబోతోంది.

మహిళా రిజర్వేషన్ బిల్లుపై ముందడుగు.. నవశకానికి నాంది పలికామన్న నరేంద్ర మోదీ..
Pm Modi
Follow us on

చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్‌ బిల్లును కాసేపట్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతోంది కేంద్రం. అయితే మహిళా రిజర్వేషన్‌ బిల్లు విషయంలో కొత్త ట్విస్ట్‌ బయటకు వచ్చింది. పార్లమెంట్‌ నియోజకవర్గాల డీలిమిటేషన్‌ ప్రక్రియ తరవాతే మహిళా రిజర్వేషన్లు అమల్లోకి రానున్నాయి. 2027 తరవాతే డీలిమిటేషన్‌ ప్రక్రియ కొలిక్కి వస్తుంది. 2029 పార్లమెంట్‌ ఎన్నికల్లో రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. పార్లమెంట్‌తో పాటు ఢిల్లీతో సహా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. డీలిమిటేషన్‌ తరువాత పార్లమెంట్‌లో 30 శాతం సీట్లు పెరుగుతాయి. డీలిమిటేషన్‌ తరువాత పార్లమెంట్‌లో 30 శాతం సీట్లు పెరుగుతాయి. ఎస్సీ,ఎస్టీ నియోజకవర్గాల్లో రొటేషన్‌ ప్రకారం రిజర్వేషన్లు అమలవుతాయి.