AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: భారత్‌ నుంచి పేదరికాన్ని దూరం చేయడమే లక్ష్యం.. ఆ దిశగా పనిచేయండి.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు..

భారతదేశం నుంచి పేదరికాన్ని దూరం చేయడమే తన కర్తవ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. పేదరికంలో మగ్గుతున్న కుటుంబాలకు బాసటగా నిలిచేందుకే ఎన్నో పథకాలను ప్రవేశపెట్టినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులందరికీ చేరడంపైనే తన దృష్టి ఇంతకాలం కేంద్రీకృతమైందని.. లక్ష్యం నెరవేరేంత వరకు ఇంకా కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు.

PM Modi: భారత్‌ నుంచి పేదరికాన్ని దూరం చేయడమే లక్ష్యం.. ఆ దిశగా పనిచేయండి.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు..
PM Modi
Shaik Madar Saheb
|

Updated on: Oct 21, 2023 | 7:48 PM

Share

భారతదేశం నుంచి పేదరికాన్ని దూరం చేయడమే తన కర్తవ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. పేదరికంలో మగ్గుతున్న కుటుంబాలకు బాసటగా నిలిచేందుకే ఎన్నో పథకాలను ప్రవేశపెట్టినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులందరికీ చేరడంపైనే తన దృష్టి ఇంతకాలం కేంద్రీకృతమైందని.. లక్ష్యం నెరవేరేంత వరకు ఇంకా కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు. ఒక్క పేద కుటుంబాన్నైనా ఆదుకునేందుకు తమ వంతు కృషిచేయాలంటూ కోరారు. దేశంలో ఉన్న పేదలు.. గ్యాస్‌ కనెక్షన్‌ లేనివారు.. బ్యాంకు అకౌంట్‌ లేనివారు.. పక్కా ఇల్లు లేని వారు, ఆయూష్మాన్‌ కార్డులు లేని వారు.. ఉన్నంత కాలం తాను ప్రశాంతంగా ఉండలేనని ప్రధాని మోదీ మరోసారి పునరుద్ఘాటించారు. భారత్‌ నుంచి పేదరికాన్ని దూరం చేయడానికి ఇవన్నీ ముఖ్యమైనవంటూ పేర్కొన్నారు. ఇదే లక్ష్యంతో తాము ముందుకువెళ్లడం ద్వారం.. ఐదు సంవత్సరాల్లో 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారంటూ మోదీ పేర్కొన్నారు. ఇదే లక్ష్యంతో ముందుకు వెళితే.. భారత్‌ పేదరికాన్ని జయిస్తుందని.. ప్రపంచంలోనే మొదటి దేశంగా నిలుస్తుందని మోదీ వివరించారు.

వీడియో చూడండి..

2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులందరికీ చేరాలంటూ అధికారవర్గాలను ఆదేశించారు. అంతేకాకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, పథకాలను వేగంగా అమలు చేసేందుకు ప్రణాళిక రచించాలని, అదే తన ప్రధాన కర్తవ్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాలను వేగంగా అమలు చేసేందుకు, తమ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆరు నెలల్లో పూర్తిస్థాయిలో అమలు చేసేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీ అధికారులను ఆదేశించినట్లు శనివారం అధికారిక వర్గాలు తెలిపాయి. పథకాల అమలును నిర్ధారించడానికి కేంద్రం మొత్తం 2.7 లక్షల పంచాయతీల్లో ‘విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ను కూడా ప్రారంభించనుంది.

పీటీఐ వార్తా సంస్థ నివేదిక ప్రకారం.. వచ్చే నెల దీపావళి తర్వాత ప్రభుత్వ ప్రచారం ప్రారంభమవుతుంది. ఇది అనేక వారాల పాటు కొనసాగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర కింద ప్రత్యేకంగా తయారు చేసిన వాహనాలు దేశవ్యాప్తంగా ఉన్న లబ్ధిదారుల వద్దకు చేరుకుంటాయని అధికారులు తెలిపారు. ఇప్పటికీ ప్రయోజనాలు పొందని అర్హులైన లబ్ధిదారులకు.. అన్ని పథకాలు అందేలా చూడాలని ప్రధాని మోదీ ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశాలలో ఉన్నత అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. “రాబోయే ఆరు నెలల్లో తన పథకాలన్నీ అర్హులైన అందరికీ పూర్తి స్థాయిలో చేరుకోవాలని తాను కోరుకుంటున్నానని” ప్రధాని మోదీ చెప్పినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us